2019లో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ నో

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp
Updated:  2018-09-28 13:06:47

2019లో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ నో

అధికార తెలుగుదేశం పార్టీ కంచుకోట విశాఖ జిల్లాలోని చోడ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయంగా చాలా కీల‌క‌మైన‌ది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కాపు, వెల‌మ, గ‌వ‌ర, ప్ర‌ధాన సామాజిక వ‌ర్గాలు. అయితే ఇక్క‌డ కాపులే అభ్యర్థుల గెలుపు ఓట‌మిల‌ను నిర్ణ‌యిస్తారు. ప్ర‌స్తుత‌ అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు చోడ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2004లో  పోటీ చేసి గెలిచారు. ఇక 2009కి ఆయ‌న అన‌కాప‌ల్లికి మార‌డంతో టీడీపీ అభ్య‌ర్ధి రాజు తెర‌పైకి వ‌చ్చారు. విద్యావంతుడు స్థానికి ప్ర‌జ‌ల‌పైప‌ట్టున్న రాజు 2014లో టీడీపీ త‌ర‌పున పోటీచేసి స్వ‌ల్ప‌మెజార్టీతో గెలిచారు. 
 
2009 నుంచి సుమారు ఐదు ఏళ్లు ప్ర‌తిప‌క్షంగా ఉన్న రాజు 2014 ఎన్నిక‌ల ప్ర‌చారంలో మాత్రం భారీ అజెండాతో ప్ర‌జ‌ల్లోకి వెళ్లారు. తాను ఎమ్మెల్యే అయితే గోదాడ షుగ‌ర్ ఫ్యాక్ట‌రీ అభివృద్ది, పెద్దేరు జ‌లాశ‌యం నుంచి కుడికాలువ ద్వారా సాగు నీటి స‌మ‌స్య, అలాగే విద్య‌, వైద్య మౌళిక క‌ల్ప‌న వంటి చాలా హామీల‌ను ఇచ్చారు రాజు. అయితే ఈ హామీల‌ను అమ‌లు విష‌యంలో పూర్తిగా విఫ‌లం అయ్యార‌ని నియోజ‌క‌వ‌ర్గా ప్ర‌జ‌ల అవేద‌న.
 
పార్టీ అధికారంలోకి వ‌చ్చి నాగున్న‌ర సంవ‌త్స‌రాలు అయినా కూడా ఇంత‌వ‌ర‌కు షుగ‌ర్ ఫ్యాక్ట‌రి ఎమ్మెల్యే శంకుస్థాప‌చెయ్య‌లేదు. ప్ర‌భుత్వం నుంచి వంద‌ల‌కోట్లు సాధించామ‌ని ప్ర‌చారం చేస్తున్నా కూడా అసించ‌ని స్థాయిలో ఆయ‌న‌కు ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు తెలుప‌డంలేదు.  ఈ క్ర‌మంలో 2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో ఆయ‌న ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను క‌ప్పిపెట్టి మ‌రోసారి ముచ్చ‌ట‌గా మూడోసారి పోటీ చేసి హ్య‌ట్రిక్ విజ‌యం కోట్టాల చూస్తున్నారు రాజు. 
 
గ‌తంలో ఈయ‌న రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా పూర్తి స్థాయిలో మెప్పంచ‌లేక‌పోవ‌టం ఆయ‌న‌కు పెద్ద మైన‌స్. ఇక పార్టీ ప‌రంగా కూడా చోడ‌వ‌రం ఎమ్మెల్యేపై అసంతృప్తి క‌నిపిస్తోంది. జిల్లా మంత్రి గంటా శ్రీనివాస్ తో అంటిముట్ట‌న‌ట్లుగా ఉన్న రోజుకు ఓ వ‌ర్గం ఎప్ప‌టినుంచో వ్య‌తిరేకంగా ఉంది. దీంతో ఈయన‌కు బ‌దులుగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున మ‌రో కొత్త అభ్య‌ర్థిని బ‌రిలో దింప‌వ‌చ్చు అనే ఊహాగానాలు వ‌స్తున్నాయి. దీంతో రాజు పార్టీపై సంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.