రాజ్య‌స‌భ‌కు వైసీపీ త‌ర‌పున మ‌రో కొత్త అభ్య‌ర్ది

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp offer rajyasabha seat to sunil
Updated:  2018-03-05 12:59:07

రాజ్య‌స‌భ‌కు వైసీపీ త‌ర‌పున మ‌రో కొత్త అభ్య‌ర్ది

గోదావ‌రి జిల్లాలు అంటేనే మెజార్టీ కాపు నాయ‌కులు అన్ని పార్టీల్లో క్రియాశీలకంగా ఉంటారు.. ఇక ఈ ఏ పార్టీ అధికారంలోకి వ‌చ్చినా ఈ జిల్లాలో కాపుల‌కు మేజ‌ర్ గా మంత్రి ప‌ద‌వులు కేటాయించ‌డం గ‌త నాలుగు ద‌శాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం.. ఇక గ‌త ఎన్నిక‌ల్లో కూడా వైసీపీ తెలుగుదేశం ఇక్క‌డ ట‌ఫ్ వార్ జ‌రిగింది కాపుల‌కు తెలుగుదేశం కంటే వైసీపీఎక్కువ సీట్లు కేటాయించినా కాపు ఓట్లు అన్ని ప‌వ‌న్ ఉండ‌టంతో తెలుగుదేశానికి మ‌ళ్ల‌డం జ‌రిగింది.
 
తాజాగా రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌కు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు రెడీ అవుతున్నాయి..తాజాగా తూర్పుగోదావ‌రి జిల్లాలో ఓ వైసీపీ నాయ‌కుడికి తెలుగుదేశం గాలం వేస్తోంది అది కూడా మేజ‌ర్ గా రాజ్య‌స‌భ ప‌ద‌వి ఇవ్వ‌డానికి.. ఆయ‌న ఎవ‌రో కాదు గ‌త ఎన్నిక‌ల్లో కాకినాడ నుంచి వైసీపీ త‌ర‌పున పోటీ చేసిన ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త చ‌ల‌మ‌శెట్టి సునీల్.. ఆయ‌న్ని తెలుగుదేశంలోకి చేర్చుకోవ‌డానికి పార్టీ రెడీ అవుతోంది తెలుగుదేశంలోకి చేరితో క‌చ్చితంగా రాజ్య‌స‌భ ప‌ద‌వి వ‌స్తుంది అని ఆయ‌న‌కు ఆఫర్ ఇస్తోంది ఇప్ప‌టికే తెలుగుదేశం నాయ‌కులు సునీల్ తో చ‌ర్చ‌లు జ‌రిపారు అని ఓ మీడియా క‌థనం వెల్ల‌డించింది. 
 
సునీల్ వ్యాపారంగా మంచి పేరు తెచ్చుకున్నారు ఇక్క‌డ ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో రాజ‌కీయ నాయ‌కులు అంద‌రికి ఆయ‌న సుప‌రిచితులు... ఇక చిరంజీవి పిలుపు మేర‌కు స‌న్నిహిత సంబంధాలు ఉండ‌టంతో ఆయ‌న 2009 లో  పీఆర్పీలో చేరారు కాని ఆ ఎన్నిక‌ల్లో సీనియ‌ర్ నాయ‌కుడు ప‌ల్లం రాజు చేతుల్లో ఓట‌మి పాల‌య్యారు..2014 ఎన్నిక‌ల్లో వైసీపీలో చేరి మ‌ళ్లీ కాకినాడ నుంచి పోటీ చేశారు ఆ ఎన్నిక‌ల్లో తోట న‌ర‌సింహం చేతుల్లో కేవ‌లం 2500 ఓట్ల తేడాతో ఓట‌మిపాల‌య్యారు ఇప్పుడు తెలుగుదేశం ఆఫ‌ర్ ఇవ్వ‌డంతో ఆయ‌న తెలుగుదేశంలోకి చేరుతున్నారు అంటూ వార్త‌లు వ‌స్తున్నాయి అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేల‌తో ఈ మూడో అభ్య‌ర్దిని తెర‌పైకి తీసుకువ‌చ్చింది తెలుగుదేశం పార్టీ.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.