టీడీపీ డ్రామా @ప్ర‌త్యేక హోదా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-20 15:36:55

టీడీపీ డ్రామా @ప్ర‌త్యేక హోదా

అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభ‌జించిన కాంగ్రెస్ పార్టీ ఏపీకి రెండు ప్ర‌ధాన హామీల‌ను ఇచ్చింది. అయితే అందులో ఒక‌టి పోల‌వ‌రం అయితే, మ‌రోక‌టి ప్ర‌త్యేక హోదా, ఇక ఈ రెండు హామీల విష‌యంలో ఇటు చంద్ర‌బాబు నాయుడు అటు మోడీ విఫ‌లం అయ్యారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందే పొత్తుపెట్టుకుని గెలిచాక క్క‌డ టీడీపీ క్క‌డ బీజేపీ ప్ర‌భుత్వంలో చేరాయి.
 
కానీ విభ‌జ‌న హామీల అమలుకోసం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అండ్ కోలు ఎప్పుడు ప్ర‌శ్నించ‌లేదు. త‌న స్వార్థం కోసం పోల‌వ‌రం ప‌నులు చేప‌ట్టిన చంద్ర‌బాబు హోదా జోలికి వెళ్లిన ధాఖ‌లాలు క‌నిపించ‌వు హోదా ఇవ్వ‌కుండా కేంద్రం కాల‌యాప‌న చేసినా  టీడీపీలు ప‌ల్లేత్తి మాట అన‌లేదు. అయితే ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు మాత్రం హోదాకోసం నాలుగు సంవ‌త్సారాలుగా ఉద్య‌మిస్తూనే ఉంది. హోదాతోనే ఏపీ అభివృద్ది సాద్యం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న‌లు నిర్వ‌హించి ప్ర‌భుత్వాల‌పై ఒత్తిడి తెచ్చే ప్ర‌య‌త్నం చేసింది. 
 
స‌భ‌లు స‌మావేశాలు, ధ‌ర్నాలు, బంద్ ల‌తో ప్ర‌జ‌లను చైత‌న్య ప‌రిచింది. ఇక చివ‌రికి హోదా అమ‌లు కోసం వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ గుంటూరు వేధిక‌గా ఆమ‌ర‌ణ నిరాహా దీక్ష చేశారు. అయితే అమ‌రావ‌తికి  ప్ర‌ధాని మోడీ వ‌స్తున్నారనే సాకుతో వైఎస్ గ‌జ‌న్ దీక్ష‌లు భ‌గ్నం చేసింది. కానీ చంద్ర‌బాబు హోదాకోసం ఎలాంటి ప్ర‌య‌త్నాలు చేయ‌లేదు, పైగా అబివృద్దిని అడ్డుకుంటున్నారంటూ వైసీపీపై ఎదురుదాయే ల‌క్ష్యంగా ముందుకు వెళ్లారు. 
 
యువ‌భేరి లాంటి కార్యక్ర‌మాల‌తో వైఎస్ జ‌గ‌న్ ఉద్య‌మం ఉదృక్తి చేయ‌డంతో కేంద్రం ఒత్తిడి పెరిగింది. హోదా ఇవ్వ‌డంకుద‌రు అంటూ కేంద్రం పిల్లి మొగ్గ‌లు వేస్తూ హోదాకు స‌మానంగా ప్యాకేజీని ఇస్తామ‌ని కొత్త ప‌ల్ల‌వి అందుకుంది. ప్యాకేజీతో ఒరిగేది ఏమీ లేదంటూ తీవ్రంగా వ్య‌తిరేకించిన వైసీపీ హోదానే  ఏపీకి సంజీవ‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది. అయితే వైసీపీ వ్య‌తిరేకించినా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సానుకూలంగా ఉండ‌టంతో కేంద్రం ప్యాకేజిని ప్ర‌క‌టించింది. దీంతో చంద్ర‌బాబు అర్ధ‌రాత్రి మ‌రీ ప్రెస్ మీట్ స‌హ‌కరిచారు.
 
ప్ర‌త్యేక హోదా కంటే ప్యాకేజినే బెట‌ర్ అంటూ స‌మ‌ర్థించుకున్నారు. కేంద్రం హోదాతో స‌మానంగా నిధులు ఇస్తామంటే ఎందుకు తాము వ‌ద్దంటామంటూ చంద్ర‌బాబు ఎదురు ప్ర‌శ్నాలు వేశారు. అప్ప‌ట్లో అసెబ్లీ తీర్యాణం పెట్టి మ‌రీ కేంద్రానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అంతేకాదు డిల్లీకి వెల్లి ప్ర‌ధాని మోడీతో పాటు ఆర్థిక మంత్రి ఆరుణ్ జైట్లీకి  ముఖ్య‌మంత్రి సన్మానం కూడా చేశారు. అయితే హోదా విస‌యంలో మొద‌టినుంచి పోరాటం చేస్తున్న వైఎస్ జ‌గ‌న్ ఉద్య‌మాన్ని మ‌రింత ఉదృక్తం చేశారు. 
 
ఏపీకి ప్ర‌త్యేక  ఇవ్వ‌క‌పోతే వైసీపీ ఎంపీల‌తో రాజీనామా చేయిస్తామ‌ని, అయితే టీడీపీ కూడా క‌లిసి రావాల‌ని నెల్లూరు జిల్లాలో జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. దీంతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పాట్న‌ర్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముందుగా మీరు అవిశ్వాస పెట్టింది. ఇత‌ర పార్టీల మద్ద‌తు తాను కూడక‌డ‌తాన‌ని ప్ర‌క‌టించారు. ఇక ఆవేంట‌నే కేంద్రం పై అవిశ్వాసం పెడ‌తామ‌ని ప్ర‌క‌టించి ఆమేర‌కు వైసీపీ ఎంపీల‌కు దిశా నిర్ధేశం చేశారు. అవిశ్వాసం పెడ‌తామ‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించగానే టీడీపీ దిక్కుతోచ‌ని ప‌రిస్ధితిలో ప‌డిపోయింది. పైగా అవిశ్వాసం ఏం ఒరుగుతుంద‌ని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. 
 
కానీ వైసీపీ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌లేదు చెప్పిన మాట ప్ర‌కారం గత పార్ల‌మెంట్ స‌మావేశాల ప్రారంభానికి ముందు మార్చి 15 న అవిశ్వాసం నోటీసు ఇచ్చింది. మోడీకి వ్య‌తిరేకంగా మొద‌టి సారిగా అవిశ్వాసం పెట్టిన వైసీపీ అన్ని పార్టీల మ‌ద్ద‌తును కూడ‌గ‌ట్టింది. దీంతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వెన్నులో వ‌నుకు పుట్టి అసెంబ్లీ సాక్షిగా వైసీసీ ప్ర‌వేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మ‌ద్ద‌తు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. అయితే ఆ త‌ర్వాత రాత్రికి రాత్రే మాట మార్చి మేము కూడా అవిశ్వాసం పెడ‌తామంటూ మార్చ్ 16 న కేంద్రం నుంచి వైదోలిగారు చంద్ర‌బాబు. 
 
అంతేకాదు మ‌రో కొత్త డ్రామాకు తెర‌లేపారు. అప్ప‌టి వ‌ర‌కు బీజేపీతో అంట‌కాగి వైసీపీ పోరాటంతో సైకిల్ పార్టీ నాయ‌కులు ప్లేట్ ఫిరాయించారు. త‌మ‌కు ప్యాకేజి కాదు హోదానే కావాలంటూ స్వ‌రం మార్చారు. తాను మొద‌టినుంచి హోదానే కావాల‌ని అడిగానంటూ నిస్సిగ్గుగా ప్ర‌క‌టించారు కూడా. గ‌త మార్చి 15న వైసీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం అందింద‌ని 16న ప్ర‌క‌టించిన స్పీక‌ర్ చ‌ర్చ‌కు మాత్రం అనుమ‌తించ‌లేదు స‌భా ఆర్డ‌ర్ లో లేనందున అవిశ్వాసం చేప‌ట్ట‌డం కుద‌ర‌దంటూ ప్ర‌క‌టించి స‌భ‌ను వాయిదా వేశారు.
 
అయినా వైసీపీ ప‌ట్టు వ‌ద‌ల‌లేదు హోదాతోనే ఏపీకి న్యాయం జ‌రుగుతుందంటూ పార్ల‌మెంట్ సాక్షిగా పోరాటం ముమ్మ‌రం చేసింది. ఒక‌టి కాదు రెండుకాదు ఎకంగా 13 సార్లు అవిశ్వాస తీర్మ‌నం నోటీసుల‌ను ఇచ్చింది దేశంలో ఇదో రికార్డ్. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు అన్ని సార్లు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఇవ్వ‌లేదు. రోజు వైసీపీ ఇవ్వ‌డం స‌భా ఆర్డ‌ర్ లేదంటూ స‌భ‌ను స్పీక‌ర్ వాయిదా వేయ‌డం జ‌రిగిపోయింది. వైసీపీ ఎంపీలు పెట్టిన అవిశ్వాస తీర్మానం చ‌ర్చ జ‌రిగితే త‌మ బండారం బ‌య‌ట‌ప‌డుతుంద‌ని టీడీపీ బీజేపీలు నాట‌కాలు ఆడాయ‌నే ఆరోప‌న‌లు వ‌చ్చాయి. 
 
అయితే ఎన్ని ఆరోప‌న‌లు వ‌చ్చిన ప‌ట్టించుకోకుండా ప్ర‌భుత్వ పెద్ద‌లు స‌భ‌ను వాయిదా వేస్తూ పోయారు. పైగా అన్నాడీఎమ్ కే, టీఆర్ ఎస్ ల‌ను ప్రోత్స‌హించి స‌భ జ‌రుగ‌కుండా చేశార‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. అవిశ్వాసం కోసం 13 సార్లు నోటీసులు ఇచ్చినా స్పీక‌ర్ చ‌ర్చ‌కు అనుమ‌తించ‌క‌పోవ‌డంతో చెప్పిన మాట ప్ర‌కారం వైసీపీ ఎంపీలతో జ‌గ‌న్ రాజీనామా చేయించారు. రాజీనామా చేయించిన త‌ర్వాత ఎంపీలు ఏపీ భ‌వ‌న్ కు వెళ్లి ఆమ‌ర‌ణ దీక్ష చేశారు. 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.