పులివెందుల పై కొత్త ప్లాన్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan and chandrababu
Updated:  2018-06-19 03:28:47

పులివెందుల పై కొత్త ప్లాన్

వైసీపీ అధినేత కంచుకోట ప్రాంతం పులివెందుల.. ఇక్క‌డ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌న ఫ్యామిలీ రికార్డుల‌ను తిర‌గ‌రాశారు అనే చెప్పాలి.. నాడు వైయ‌స్ కు ఇక్క‌డ ఎంత ప్ర‌జాద‌ర‌ణ ఉందో నేడు దానికి రెండింత‌ల ప్ర‌జాద‌ర‌ణ ఉంది జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి..
 
పులివెందుల‌లో జ‌గ‌న్ కు మ‌రింత ప్ర‌జామ‌ద్ద‌తు పెరుగుతున్ననేప‌థ్యంలో, తెలుగుదేశం కొత్త ఎత్తులు వేస్తోంది.. మ‌రీ ముఖ్యంగా ఇక్క‌డ ఎమ్మెల్సీ సీటు క‌డ‌ప‌లో సాధించిన త‌ర్వాత తెలుగుదేశం నాయ‌కులు ఇక్క‌డ గెలుపు న‌ల్లేరుమీద న‌డ‌క అనేలా ఆలోచిస్తున్నారు.. అయితే క‌డ‌ప‌లో మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి కూడా జిల్లాలో తెలుగుదేశానికి అత్య‌ధికంగా సీట్లు వ‌స్తాయి అని చెబుతున్నారు.
 
ఇక పులివెందుల‌లో జ‌గ‌న్ కు ఓట‌మి చూపిస్తాం అంటున్నారు.. అయితే అవ‌న్నీ తెలిసిన‌వే మా పార్టీలో ఉన్న స‌మ‌యంలో ఆదినారాయ‌ణ రెడ్డి టీడీపికి ఓట‌మి చూపిస్తాం అని ప్ర‌గ‌ల్బాలు ప‌లికిన‌వే అని విమ‌ర్శ‌లు చేశారు.. అయితే తెలుగుదేశం పార్టీ పై ప్ర‌జ‌ల్లో విశ్వాసం పెంచాలి అని టీడీపీ ఆలోచిస్తోంది.. అందులో భాగంగా ప్రజాక‌ర్ష ప‌థ‌కాలు ఇక్క‌డ అమ‌లుచేయాల‌ని ముందు నుంచి భావించిన జిల్లా టీడీపీ నాయ‌కులు ఇప్పుడు కొత్త‌గా ఎత్తులు ఆలోచ‌న‌లు రాజ‌కీయంగా వేస్తున్నారు అని తెలుస్తోంది.
 
ఇక తెలుగుదేశం పార్టీ త‌ర‌పున ఓ మేనిఫెస్టో పులివెందుల‌కు ఇవ్వాలి అని అనుకుంటున్నార‌ట‌... అందులో భాగంగా పులివెందుల అభివృద్దికి సంబంధించి ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నార‌ని జిల్లా తెలుగుదేశం నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు.. ఇక నాలుగేళ్లుగా సీఎంగా ఉన్న చంద్ర‌బాబు ఇప్పుడు కొత్త మేనిఫెస్టో ఇస్తే, ఎటువంటి ప్ర‌యోజనం ఉంటుంది అని ప్ర‌శ్నిస్తున్నారు ఇక్క‌డ ఉన్న‌టు వంటి ప్ర‌జ‌లు 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.