జ‌గ‌న్ పై టీడీపీ విరిగిన బాణాలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-21 15:40:50

జ‌గ‌న్ పై టీడీపీ విరిగిన బాణాలు

తెలుగుదేశం వేసే బాణాలు అస్త్రాలు అన్నీ వైసీపీపై విరిగిపోతున్నాయి, అలాగే జ‌గ‌న్ పై  వీగిపోతున్నాయి.. ఏ అంశంలో చూసినా వైసీపీకి తెలుగుదేశం ఎదురునిలువ‌లేక‌పోతోంది.. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు తీసుకునే నిర్ణ‌యాల పై, అధికార పార్టీ చ‌ర్య‌ల‌పై ఎటువంటి విమ‌ర్శ‌లు ఇటు ప్ర‌తిప‌క్షాల నుంచి వ‌స్తున్నాయో తెలిసిందే. అయితే ఏమి జ‌రిగినా జ‌గ‌న్ కార‌ణం అంటున్నారు.. పిల్లాడు ఏడ్చినా, పిల్లి గోడ‌దూకినా, జ‌గ‌న్ కార‌ణం అన్నింటికి జ‌గ‌న్ కార‌ణం అనేలా రాజ‌కీయం చేస్తోంది తెలుగుదేశం పార్టీ.
 
ముఖ్యంగా ఆస్ధాన మీడియాలో, జ‌గ‌న్ ని తితిదే ప్ర‌ధాన అర్చ‌కుడు క‌లిస్తే జ‌గ‌న్ అన్య‌మ‌త‌స్తుడు ఎలా క‌లిశారు అని విమ‌ర్శ‌నాత్మ‌క వార్త‌లు ప్ర‌చురించారు.. సో రాజ‌కీయంగా ఇప్పుడు ఈ తితిదే వివాదం రాజుకుంది.. ఇక ఉరుము ఉరిమి దేనిమీదో ప‌డింది అనేలా చేస్తున్నారు రాజ‌కీయం..  బీజేపీ నాయ‌కులతో చంద్ర‌బాబు స‌యోధ్య‌గానే ఉన్నారు అని పాద‌యాత్ర స‌భ‌ల్లో అంటున్నారు జ‌గ‌న్.
 
అందులో భాగంగానే మ‌హారాష్ట్ర బీజేపీ మంత్రి భార్య‌కు తితిదే బోర్డు మెంబ‌ర్ అవకాశం ఎలా క‌ల్పించారు, ఇటు కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ భ‌ర్త ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ ను ఏపీ ప్ర‌భుత్వ స‌లహాదారుగా చంద్ర‌బాబు ఎలా ఉంచుకున్నారు అనేది జ‌గ‌న్ ప్ర‌శ్న. నిజ‌మే అన్ని పార్టీల నుంచి ఎదురైన పెద్ద ప్ర‌శ్న‌..
 
అయితే ఇక్క‌డే ట‌ర్నింగ్ తీసుకుంది అస‌లు పాయింట్.. ఆయ‌న జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌కు మ‌న‌స్తాపం చెంది త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు.. మ‌రోప‌క్క తెలుగుదేశం నాయ‌కులు మాత్రం దీనిని ఖండించి ఆయ‌న రాజీనామాను ఆమోదించం అంటున్నారు... ఇక్క‌డ వీరు గుర్తించాల్సింది రాజీనామా ఆమోదించాల్సింది, మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాదు అనేది..
 
అయితే కేవ‌లం 15 రోజులు మాత్ర‌మే ప‌ద‌వికి స‌మయం ఉంది.ఈటైంలో రాజీనామా అనే కొత్త మాట ఆయ‌న అన‌డం రాజీనామా చేయ‌డం వెనుక, టీడీపీ మంచి స్కెచ్ వేసింది అని బ‌య‌ట ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు. 05-07-2016 నుంచి ప‌ర‌కాల‌కు  04-07-2018 వ‌ర‌కూ ప‌ద‌విలో కొన‌సాగ‌డానికి స‌మ‌యం ఉంది.. ఇక కేవ‌లం 15 రోజుల్లో పూర్తి అవ‌నున్న ప‌ద‌వీకాలానికి, రాజీనామా అని ఇలాంటి కొత్త పీట్లు చేసి, జ‌గ‌న్ పై విరిగిన బాణాలు కాక అర్జునాస్త్రాలు అనుకోవాలా అని స‌టైర్లు ప‌డుతున్నాయి అధికార పార్టీ పై.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.