జ‌గ‌న్ వ‌స్తున్నాడు ముందు ఆ ప‌ని చేయండి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-02 13:35:01

జ‌గ‌న్ వ‌స్తున్నాడు ముందు ఆ ప‌ని చేయండి

వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర‌లో జ‌నం ప్ర‌భంజ‌నం తెలిసిందే.. ఇక తెలుగుదేశం నాయ‌కులు మ‌రో ఈక్వేష‌న్ల‌తో కొత్త రాజ‌కీయ ఫార్మూలా జ‌గ‌న్ పై ప్ర‌యోగించాలి అని అనుకున్నారు.. అస్త్ర స‌న్యాసం చేసిన వాడు చివ‌రి ప‌రిస్దితిలో ఏం చేస్తాడు, ఏమి చెయ్య‌లేడు..
 
అయితే నాలుగు సంవ‌త్స‌రాల్లో మ‌చ్చుకు కూడా ప‌లు స‌మ‌స్య‌ల కాగితాలు కూడా చ‌ద‌వ‌ని తెలుగుదేశం నాయ‌కులు, జ‌గ‌న్ ఎక్క‌డ పాద‌యాత్ర చేస్తున్నాడో అక్క‌డ వారం ముందు నుంచే పాద‌యాత్ర లైన్లో కావాల‌సిని ప‌నుల‌కు శంకుస్దాప‌న‌లు ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతూ  ఫైల్ లైన్ల‌ను క్లియ‌ర్ చేస్తున్నారు.
 
ఇది తాజాగా వైసీపీ అనుకూల మీడియా త్రినేత్రం చెప్ప‌లేదు.. భ‌జ‌న జ్యోతే చెప్పింది.. ముఖ్యంగా తెలుగుదేశం చేస్తున్న అభివృద్ది ప‌న‌లులు చూసి జ‌గ‌న్ కూడా ఆశ్చ‌ర్య‌పోతున్నాడ‌ట?  మ‌న స‌ర్కారు అధికారంలోకి వ‌స్తే ఇటువంటివి అమ‌లుచేయ‌గ‌ల‌మా అని ఆలోచిస్తున్నార‌ట జ‌గ‌న్? అది వారి అంత‌రంగీక మ‌నో ఆలోచ‌న‌.
 
ఇక తెలుగుదేశం పార్టీ తీసుకునే కొన్ని నిర్ణ‌యాలు జంద్యాల సినిమాలా పైకి బాగానే న‌వ్విస్తున్నాయి.. ఆ ఒక్క‌టీ అడ‌క్కూ అంటూ నాలుగేళ్లు ప్ర‌జ‌ల‌ను మ‌భ్య పెట్టి ఇప్పుడు ఎవ‌రూ అడ‌గ‌కుండానే ప‌నులు ముందుకు సాగుతున్నాయి.. అయితే ఇటు విశాఖ కార్పొరేష‌న్ కూడా ఎన్నిక‌ల స‌మ‌రానికి రెడీ అవ్వ‌నుంది.. అందుకే ఇక్క‌డ కూడా  జ‌గ‌న్ పాద‌యాత్ర చేరేస‌రికి  500 రూపాయ‌ల మొక్క‌లు, 10 వేల రూపాల‌య వృక్షాలు, ల‌క్ష‌రూపాయ‌ల మానులు తీసుకువ‌చ్చి బీచ్ ఒడ్డున పాతేసినా ఆశ్చ‌ర్య‌పోక్క‌ర్లేదు.
 
ఇటు ఐటీ కారిడార్ సెకండ్ట్ స్టేజ్ విశాఖ అని చెబుతున్నారు.....ఫేజ్ 2 గా ఉండేలా అమ‌రావ‌తి త‌ర్వాత విశాఖ వైపు కంప్యూట‌ర్ కంపెనీలు చూసేలా చేస్తామ‌ని చెబుతున్నారు.. అందుకే జ‌గ‌న్ ఇక్క‌డ పాద‌యాత్రకు వ‌చ్చేలోప‌ల 75 ల‌క్ష‌ల రూపాల‌య లోపు  బిల్లులు కాంట్రాక్టులు చ‌క‌చ‌కాజ‌రిగిపోవాలి ..అదీ సంగ‌తి సీసీ రోడ్డు అయినా కంక‌ర రోడ్డు అయినా స‌రే పోత పోయాల్సిందే.. అదే రోడ్లు చూపించి చూశారా జ‌గ‌న్ మేము వేసిన రోడ్ల‌పై న‌డుస్తున్నాడు అంటారు అదీ సంగ‌తీ.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.