ఎన్డీఏతో క‌టీఫ్ టీడీపీ సంచ‌ల‌న నిర్ణ‌యం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-16 13:10:03

ఎన్డీఏతో క‌టీఫ్ టీడీపీ సంచ‌ల‌న నిర్ణ‌యం

తెలుగుదేశం పార్టీ మ‌రో కొత్త ఎత్తుగ‌డ‌కు రెడీ అయింది.. ఎన్డీయేతో ఇప్ప‌టి వ‌ర‌కూ కొన‌సాగిన తెలుగుదేశం పార్టీ ఎన్డీయేకు నేడు గుడ్ బై చెప్పింది.. తెలుగుదేశం పొలిటిబ్యూరో స‌భ్యుల‌తో మాట్లాడిన సీఎం చంద్ర‌బాబు, ఎన్డీయేతో బ‌య‌ట‌కు వ‌స్తున్నట్లు తెలియ‌చేశారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలతో అధికార తెలుగుదేశం పార్టీ ఎన్టీయేపై తీవ్ర అసంతృప్తితో ఉంది. ఏపీకి ప్ర‌త్యేక హూదా ఇవ్వ‌డానికి బీజేపీ ముందుకు రాక‌పోవ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకుంది టీడీపీ.
 
ఇక మంత్రులుగా ఉన్న అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరిలతో రాజీనామా చేయించిన టీడీపీ అధిష్టానం చివరకు ఎన్డీయేలో కొనసాగరాదని నిర్ణయం తీసుకుంది.. వైసీపీ పెట్టే అవిశ్వాసానికి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం కంటే మ‌న‌మే అవిశ్వాస తీర్మానం పెడితే మంచిది అని, పార్టీ త‌ర‌పున క్రెడిట్ ఉంటుంది అని తెలుగుదేశం ఆలోచిస్తోంది.
 
ఇప్ప‌టికే  ఢిల్లీలో ఉన్న ఎంపీలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి తెగతెంపుల విషయం చెప్పారని తెలుస్తోంది..టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించారు.... అవిశ్వాసం నోటీస్ ఇవ్వాలని ఎంపీ తోట నర్సింహంకు ఆదేశాలు పంపారు. మిత్ర‌ప‌క్షంగా కొన‌సాగుతూ వారి పై అవిశ్వాసం పెట్ట‌డం కంటే మ‌న‌మే బ‌య‌ట‌కు వ‌చ్చి అవిశ్వాసం పెట్ట‌డం మంచిది అని అన్నారు..అలాగే బీజేపీ తో తెగ‌దెంపుల‌పై బీజేపీ చీఫ్ అమిత్ షాకు, అలాగే ఎన్డీయే మిత్ర‌ప‌క్ష పార్టీల‌కు తెలుగుదేశం లేఖ‌లు రాయ‌నుంది.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.