కాంగ్రెస్‌తో టీడీపీ కుమ్మ‌క్కు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

congress -tdp parliament
Updated:  2018-04-05 06:16:41

కాంగ్రెస్‌తో టీడీపీ కుమ్మ‌క్కు

ఏపీకి ప్ర‌త్యేక‌హోదా ప్ర‌క‌టించాలంటూ కేంద్రం పై చేస్తున్న పోరాటం రాజ‌కయాల్లో అనేక మార్పుల‌ను తీసుకువ‌స్తోంది.....ఏపీకి ప్ర‌త్యేక హూదా విష‌యంలో  తెలుగుదేశం, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వంతో ఉన్న మైత్రి బంధానికి విడాకులు ఇచ్చింది..కేంద్రం పై ఏపీలో ఉన్న అన్ని రాజ‌కీయ పార్టీలు అవిశ్వాస తీర్మానం చేప‌ట్టాయి. పార్ల‌మెంట్ చివ‌రి రోజున రాష్ట్రానికి ప్ర‌త్యేక‌హోదా ప్ర‌క‌టించ‌క‌పోతే వైసీపీ త‌మ‌ ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి దిల్లీ ఏపీ భ‌వ‌న్‌లో ఆమ‌ర‌ణ  నిరాహార దీక్ష చేస్తామ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.
 
సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో రాజ‌కీయ పార్టీలు వ్యూహ‌త్మ‌కంగా అడుగులు వేస్తున్నాయి. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న పార్ల‌మెంట్ స‌మావేశాల్లో స‌మ‌స్య‌ల పై చ‌ర్చించ‌డానికి అధికార బీజేపీ నిరాక‌రిస్తోంది. దీని పై ప్రతిపక్ష పార్టీ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ధర్నా కార్య‌క్ర‌మం నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో కాంగ్రెస్‌, ఎస్పీ సభ్యులతోపాటు టీడీపీ ఎంపీలు కూడా పాల్గొన్నారు. ప‌చ్చగ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే టీడీపీ-కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చెట్టాపట్టాల్‌ వేసుకొని తిరగడం ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.
 
ఈ సందర్భంగా కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ పక్కన నిలబడి టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌ ప్లకార్డు ప్రదర్శించారు. మరో టీడీపీ ఎంపీ సుజనా చౌదరి కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్‌కు షేక్‌హ్యాండ్‌ ఇవ్వగా.. తోట నర్సింహం చేతిలో చెయ్యేసి జైరాంతో సన్నిహితంగా ముచ్చటించారు.
 
ఆంధ్రప్రదేశ్‌ విభజన పాపం కాంగ్రెస్‌ పార్టీదేనని బ‌హిరంగంగా టీడీపీ ఆరోపిస్తున్నా  అంతర్గతంగా ఆ రెండు పార్టీలు సన్నిహితంగా మెలుగుతున్నట్టు తాజా పరిణామాలు వెల్ల‌డిస్తున్నాయి.  చంద్రబాబు ఢిల్లీ పర్యటనలోనూ కాంగ్రెస్‌-టీడీపీ అనుబంధం బయటపడిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్‌ పటేల్‌తో చంద్రబాబు భేటీ అయినట్లు జాతీయ మీడియా పేర్కొంది. కాంగ్రెస్‌తో కలవనని చెబుతూనే ఆ పార్టీ నేతలతో ముఖ్యమంత్రి సమావేశం కావడం గమనార్హం. పార్లమెంట్‌లోనూ కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌తో చంద్రబాబు మాట్లాడిన సంగతి తెలిసిందే.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.