ప‌రిటాల శ్రీరామ్ కు సీటు ఫిక్స్ చేసిన టీడీపీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu naidu and paritala family
Updated:  2018-09-27 11:57:06

ప‌రిటాల శ్రీరామ్ కు సీటు ఫిక్స్ చేసిన టీడీపీ

అనంత‌పురం జిల్లా రాజ‌కీయాలు అంటే ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌సరం లేదు. తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు మాజీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క‌రామారావు నుంచి నేటీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు వ‌ర‌కు టీడీపీకి కంచుకోట‌గా వ్య‌వ‌హ‌రిస్తుంది ఈ జిల్లా. అయితే ఈ జిల్లాలో టీడీపీకి ఐకాన్ లా వ్య‌వ‌హ‌రిస్తున్నారు ప‌రిటాల వార‌సులు. గ‌తంలో ప‌రిటాల ర‌వి మ‌ర‌ణం త‌ర్వాత రాజ‌కీయ వార‌స‌త్వాన్ని ఆయ‌న స‌తీమ‌ణి ప‌రిటాల సునిత తీసుకున్నారు. 
 
ఆ త‌ర్వాత నుంచి ఆమె రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ త‌ర‌పున పోటీచేసి వరుస విజ‌యాలు సాదిస్తునే ఉన్నారు. ఇదే క్ర‌మంలో తెలుగు రాష్ట్రాలు విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత మొద‌టి సారిగా ఎన్నిక‌లు జ‌రిగితే ఆ ఎన్నిక‌ల్లో ప‌రిటాల సునిత పార్టీ త‌ర‌పున రాప్తాడులో పోటీ చేసి గెలిచారు. అంతేకాదు పార్టీ అధికారంలోకి రావ‌డంతో అధిష్టానం ఆమెకు మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది. 
 
ఇక ఆమె మంత్రిగా ఉంటే ఆమె కుమారుడు ప‌రిటాల‌ శ్రీరామ్ నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌ల‌ను చూసుకుంటున్నారు. ఇక ఇదే క్ర‌మంలో విమ‌ర్శ‌లు కూడా ఈ నాలుగు సంవ‌త్స‌రాల్లో ఎక్కువ వ‌చ్చాయి. అయితే వారు అధికార పార్టీలో ఉండ‌టంతో ప‌రిటాల అనుచ‌రుల‌కు తిరుగు లేకుండా పోయింది. ప‌రిటాల ర‌వి త‌ర్వాత అత‌ని భార్య సునిత ఆమె త‌ర్వాత ప‌రిటాల శ్రీరామ్ జిల్లాలో మారుమ్రోగుతున్న పేర్లు. 
 
అందుకే వ‌చ్చే ఎన్నిక‌ల్లో శ్రీరామ్ ను పోటీ చేయించాల‌ని అధిష్టానం భావిస్తుంది. ఈ క్ర‌మంలో ఆయ‌నను వ‌చ్చే ఎన్నిక‌ల్లో పెనుకొండ‌, ధ‌ర్మ‌వ‌రం సెగ్మెంట్ లు ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీచేయించాల‌ని చూస్తున్నార‌ట‌. కానీ సునిత మాత్రం త‌న కుమారుడిని రాప్తాడులో పోటీ చేయించాల‌ని చూస్తుంది. అయితే అనుహ్య ప‌రిణామాల నేప‌థ్యంలో శ్రీరామ్ హిందూపురం ఎంపీ సీటును కేటాయించి పోటీ చేయించాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చూస్తున్నార‌ట‌. మ‌రి ప‌రిటాల కుటుంబం ఇందుకు  ఓకే చెబుతుందా లేదా అన్నది పెద్ద‌ప్ర‌శ్న‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.