కృష్ణ జిల్లాలో టీడీపీకి బీటలు, జోరుగా వైసీపీ...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

krishna image
Updated:  2018-03-04 12:58:17

కృష్ణ జిల్లాలో టీడీపీకి బీటలు, జోరుగా వైసీపీ...

తెలుగుదేశం పార్టీకి కృష్ణా జిల్లా   కంచుకోట అని అంద‌రికీ తెలుసు. మాకు ఈ జిల్లాలో తిరుగులేదంటూ....బల్లలు గుద్ది మ‌రీ  చెప్తారు టీడీపీ నాయకులు... కానీ  ప్ర‌స్తుత వాస్తవిక పరిస్థితులను గమనిస్తే కృష్ణ జిల్లాలోని 18 నియోజగకవర్గాల్లో రెండు నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని చోట్లా టీడీపీపై  అసమ్మతి సెగలు భగ్గుమంటున్నాయి... దాదాపు అన్ని చోట్ల ఎమ్మెల్యేలకు, సెకండ్ క్యాడర్ కి మధ్య పోరు తారాస్థాయికి చేరుకుంది... వీళ్ళ మధ్య జరుగుతున్న పోరులో సెకండ్ క్యాడర్ నాయ‌కులు మొత్తం తీవ్ర నిరాశలో ఉన్నారు.
 
ఈ జిల్లాలో చాలా  చోట్ల వర్గ పోరు అనేది  టీడీపీకి పెద్ద మైనస్ గా చెప్పవచ్చు..ఈ అంశం ప్ర‌తిపక్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీకి   కలిసివచ్చే అంశంగా చెప్ప‌వ‌చ్చు...తాజాగా జిల్లా కేంద్ర‌మైన మ‌చిలీప‌ట్నం బందరు టీడీపీలో వర్గపోరు బయటపడింది. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పదవితో పాటు, కీలక పదవులు అన్ని ఇతర సామజిక వర్గానికి టీడీపీ అధిష్టానం అప్పగించడంతో, కాపు సామాజికవర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది...
 
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పదవిని ఆశించిన టీడీపీ సీనియర్‌ నాయకులు గొర్రెపాటి గోపిచంద్‌కు పార్టీ షాక్ ఇచ్చింది...ఈ పదవిని బండారు హనుమంత రావుకు కేటాయిస్తూ టీడీపీ జీవో విడుదల చేసింది. దీంతో గోపిచంద్ సామాజికవర్గం   టీడీపీపై గుర్రుగా ఉంది.. గోపీచంద్ పార్టీ కోసం నిరంతరం కష్టపడినా పట్టించుకోలేదని టీడీపీపై మండిపతున్నారు.
 
అందుకే గోపిచంద్ కి మద్దతుగా అయన సామాజికవర్గానికి చెందిన బందరు రూరల్‌ మండల పార్టీ అధ్యక్షులు కుంచె నాని, మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యులు గణితిశెట్టి గోపాల్‌  మరియు ఇతర టీడీపీ నాయకులు రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు...దీంతో గోపీచంద్, అయన అనుచరులు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది...
 
వైసీపీ నేతలు మాత్రం దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, క్యాడర్ లో నూతన ఉత్తేజాన్ని నింపుతూ, అందరిని కలుపుకొని ముందుకు వెళ్తున్నారు...ఈ జిల్లాలో టీడీపీపై అసమ్మతి పెరగటంతో అందరూ వైసీపీ వైపు మొగ్గుచూపుతున్నారు...కృష్ణ జిల్లాలోని చాల నియోజకవర్గాల్లో టీడీపీకి బీటలు పడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.