టీడీపీ సీనియ‌ర్ నేత రాజీనామా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-18 18:12:44

టీడీపీ సీనియ‌ర్ నేత రాజీనామా

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌రప‌డే కొద్ది ఇటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అటు తెలంగాణ‌లో టీడీపీ నుంచి వల‌స‌లు  విప‌రీతంగా  పెరిగిపోతున్నాయి. ఇక తెలంగాణలో టీడీపీ నాయ‌కులు సంఖ్య‌ అర‌కొర‌కు మాత్ర‌మే ఉంది. అయితే ఇక్క‌డ లీడింగ్ లో ఉన్న పార్టీలు టీఆర్ఎస్, కాంగ్రెస్.ఈ రెండు పార్టీలు 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో నువ్వా నేనా అన్న‌ట్లు బ‌రిలో దిగి అధికారాన్ని ద‌క్కించుకోనున్నాయి. మిగిలిన పార్టీ నాయ‌కులు ఈ రాష్ట్రంలో  ఎవ‌రు పోటీ చేసినా అధికారాన్ని మాత్రం ద‌క్కించుకోలేర‌ని ప్ర‌జ‌ల అభిప్రాయం.
 
అందుకే టీడీపీ నాయ‌కులు ఇత‌ర పార్టీలలోకి వ‌ల‌స‌లు వెళ్తున్నారు. ఒక ఇప్ప‌టికే టీడీపీ త‌ర‌పున కీల‌క భాధ్య‌త‌ల‌ను స్వీక‌రించిన రేవంత్ రెడ్డి కూడా గ‌తంలో పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ స‌మ‌క్షంలో పార్టీలో చేరిన సంగ‌తి తెలిసిందే. ఇక ఇదే క్ర‌మంలో మ‌రో వ్య‌క్తి టీడీపీకి రాజీనామా చేశారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశంపార్టీ కి 30 సంవత్సరాలు సేవలందించిన ఖమ్మం జిల్లా సీనియర్ న్యాయవాది తెలుగుదేశం పార్టీ ఖమ్మం జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు గోగుల బ్రహ్మయ్య టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు. త‌న రాజీనామాను ఒక లేఖ రూపంలో టీడీపీ అధ్య‌క్షులు, ఎల్. ర‌మ‌ణ‌కి, అలాగే ఫ్యాక్స్ రూపంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు పంపించారు. ఆయ‌న స‌డ‌న్ గా  త‌న రాజీనామాను ఫ్యాక్స్ రూపంలో పంపించ‌డంతో  చంద్ర‌బాబు షాక్ కు గుర‌య్యారు. ఇక గోగుల బ్రహ్మయ్య రాజీనామాతో తెలంగాణలో టీడీపీ పూర్తిగా క‌నుమ‌రుగైంద‌నే చెప్పాలి.
 
ఇక ఇదే క్రమంలో ఏపీలో కూడా టీడీపీ నుంచి వైసీపీలోకి విప‌రీతంగా వ‌ల‌స‌లు పెరిగిపోతున్నాయి. ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్ జ‌గ‌న్‌ 2019 అధికార‌మే ల‌క్ష్యంగా చేసుకుని ఎర్ర‌ని ఎండ‌ను సైతం లెక్క‌చేయ‌కుండా ప్ర‌జా సంక‌ల్పయాత్ర‌ను చేప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఆ సంక‌ల్ప‌యాత్ర‌లో జ‌గ‌న్ స‌మ‌క్షంలో టీడీపీ నాయ‌కులు వైసీపీ తీర్థం తీసుకుంటున్నారు.

షేర్ :

Comments

1 Comment

  1. I LIKE JJANAHITAM

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.