టీడీపీ సీనియర్ నేత ఘాటు వ్యాఖ్యలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-21 15:55:08

టీడీపీ సీనియర్ నేత ఘాటు వ్యాఖ్యలు

2014 ఎన్నికలలో వైసీపీ గుర్తుపైన గెలిచి అధికారపార్టీ పెట్టిన ప్రలోభాబాలకు లొంగి 23 మంది పార్టీ ఫిరాయించారు...పార్టీ ఫిరాయించిన వారిలో ఇద్దరి పేర్లు అందరి నోళ్ళలో నానుతూ ఉంటాయి...ఒకరు బీకామ్ ఫిజిక్స్ తో ఫేమస్ అయితే...మరొకరు దళితులపై చేసిన వ్యాఖ్యలు, జగన్ పైన, జగన్ కుటుంబంపైన చేసిన వ్యాఖ్యల‌తో ఫేమస్ అయ్యారు...
 
ఆదినారాయణ రెడ్డి కడప జిల్లాలో పెత్తనం చలాయించలని చూశారు...కానీ ఆదినారాయణ రెడ్డి పాచికలు పారేటట్టు కనిపించడం లేదు...అదినారాయణ రెడ్డిపై సొంత నేతలే మండిపడుతున్నారు...ఆదినారాయణ రెడ్డి సీట్ల కేటాయింపు నా పరిధిలోనే జరుగుతుంది అని అనుచిత వ్యాఖ్యలు చేశారు.. సీట్లు కేటాయించడానికి నువ్వు ఎవరు, నీకు ఆ హక్కు ఎవరు ఇచ్చారు అని రామసుబ్బా రెడ్డి, మంత్రి ఆదికి కౌంటర్ ఇచ్చారు..
 
కమలాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీర శివారెడ్డి, మంత్రి ఆదినారాయణ రెడ్డిపై మండిపడ్డారు. మా పైన పెత్తనం చెలాయించాలని చూస్తే ఊరుకునేది లేదని అన్నారు... నీ పని నువ్వు చూసుకో, నీ పేరు నేను ప్రస్తావించలేదు...నువ్వు నా పైన విమర్శలు చేసే హక్కు నీకు ఎవరు ఇచ్చారు.. ఈ జిల్లాలో నేనే సీనియర్‌ నాయకుడిని...నువ్వు నిన్నకాక మొన్న పార్టీలోకి వచ్చావు.. జిల్లాలో నీ పెత్తనం ఏంటి, నేనే టికెట్ లు ఇస్తా అని చెప్పుకుంటున్నావు...నీకు అంత సీన్ లేదు అని మండిపడ్డారు వీర శివారెడ్డి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.