టీడీపీ సంచ‌ల‌న నిర్ణ‌యం ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-14 03:37:10

టీడీపీ సంచ‌ల‌న నిర్ణ‌యం ?

అవును బ్ర‌హ్మాండం ఏమీ బ‌ద్ద‌లు అవ్వ‌డం లేదు, అస‌లు వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే వ‌చ్చేది ఏముంది. నాన్సెన్స్ జ‌గ‌న్ రాజ‌కీయంగా ప‌బ్బం గ‌డ‌ప‌డానికి ఇటువంటి దారులు ఎంచుకుంటున్నాడు అని వైసీపీ అధినేత జ‌గ‌న్ పై,  నాయ‌కుల పై తెలుగుదేశం నాయ‌కులు  కామెంట్లు చేస్తున్నారు.
 
అయితే త‌మ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారు అని జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న చేయ‌డంతో, ఇటు రాజ‌కీయంగా ఈ వార్త పెను సంచ‌ల‌నంగా మారింది... ఇక తెలుగుదేశం ఎంపీలు దీనీపై ఎటువంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం లేదు అనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.... ఇక జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌తో తెలుగుదేశం నిద్ర‌నుంచి మేల్కొంది.
 
తాజాగా మంత్రి అచ్చెన్నాయుడు కొన్ని కామెంట్లు చేశారు...  మార్చి 5వ తేదీ తర్వాత ఊహించని నిర్ణయాలు జరుగుతాయని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు... రాష్ట్రంలో అధికార ప్ర‌తిప‌క్ష పార్టీల పాత్ర‌లు మేమే పోషిస్తున్నామ‌ని ఆయ‌న అన్నారు.... అయితే తాజాగా తెలుగుదేశం తీసుకునే నిర్ణ‌యం ప్ర‌కారం, కేంద్రం నుంచి త‌మ మంత్రుల‌ను రాజీనామా చేయించే యోచ‌న‌లో తెలుగుదేశం ఉంది అని కూడా కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు. 
 
మ‌రీ ముఖ్యంగా పార్టీలో నాయ‌కులు మ‌నం రాజీనామా చేస్తేనే కేంద్రం పై ఒత్తిడి పెరుగుతుంది అనే విధంగా తెలుగుదేశం అధినేత‌కు స‌ల‌హా ఇస్తున్నారు..... మొత్తానికి మంత్రి అచ్చెన్నాయుడు చేసిన కామెంట్ ఇప్పుడు తెలుగుదేశం ఎటువంటి నిర్ణ‌యం తీసుకోవ‌డానికి సిద్ద ప‌డుతుందా అనే డైల‌మాలో ప‌డేసింది పార్టీలో నాయ‌కుల‌ను.

షేర్ :

Comments

1 Comment

  1. Jagan resign sepistanante meerukuda sepisat manata goppatanam

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.