ఆదినారాయ‌ణ రెడ్డికి టీడీపీ అదిరిపోయే స్కెచ్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-04 18:40:53

ఆదినారాయ‌ణ రెడ్డికి టీడీపీ అదిరిపోయే స్కెచ్

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున పోటీచేసి అత్య‌ధిక మెజారిటీతో గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు గతంలో అభివృద్ది పేరు చెప్పి అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కుల ప్ర‌లోభాల‌కు ఆశ‌ప‌డి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు. అంతే కాదు రాజ్యాంగానికి విరుద్దంగా ముగ్గురికి మంత్రి ప‌ద‌వుల‌ను కూడా అప్ప‌గించింది టీడీపీ అధిష్టానం. ఇక ఈ ముగ్గురు మంత్రుల‌లో ఎక్కువ‌గా వినిపించే పేరు ఫిరాయింపు మంత్రి ఆదినారాయ‌ణ‌ రెడ్డి. 
 
గ‌డిచిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో తాను వైసీపీ కోసం నిరంత‌రం కృషి చేస్తాన‌ని చెప్పిన మాట‌లు ప్ర‌తీ ఒక్క‌రికి గుర్తే ఉంటుంది.  అలాంటి మాట‌లు చెప్పిన ఆదినారాయ‌ణ రెడ్డి ఇప్పుడు టీడీపీ గూటికి చేరి చంద్ర‌బాబు ద‌గ్గ‌ర మార్కులు కొట్టెయ్యాల‌నే ఉద్దేశ్యంతో రాజ‌కీయ జీవితాన్నిఇచ్చిన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు.
 
అయితే ఆదినారాయ‌ణ రెడ్డి, చంద్ర‌బాబు నాయుడు ద‌గ్గ‌ర ఎన్నిమార్కులు కొట్టేశారో తెలియ‌దుకాని ఆయ‌న పార్టీ ఫిరాయించిన త‌ర్వాత క‌డ‌ప జిల్లా టీడీపీ నాయ‌కుల ద‌గ్గ‌ర మాత్రం ఒక్క మార్కును కూడా సంపాదించుకోలేపోయారు. ఇక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో న‌లుగురు సెగ్మెంట్ల ఇంచార్జ్ లు మంత్రి ఆదితో స‌రిగ్గా స‌యోధ్య‌గా ఉండడంలేదు. 
 
ఇక జ‌మ్మ‌ల‌మ‌డుగు ఇంచార్జ్ రామ‌సుబ్బారెడ్డి గురించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆదినారాయ‌ణ రెడ్డి పార్టీ ఫిరాయించిన‌ప్ప‌టి నుంచి నియోజ‌క‌వ‌ర్గంలో వీరిద్ద‌రి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే బ‌గ్గుమంటోంది. దీనికితోడు చంద్ర‌బాబు జిల్లా బాధ్య‌త‌ల‌ను ఆదినారాయ‌ణ‌ రెడ్డికి ఇవ్వ‌డంతో వారిద్ద‌రి మ‌ధ్య మ‌రింత నిప్పు ర‌గిలిపోయింది. మంత్రిగా రాష్ట్ర  టీడీపీ నాయ‌కుల్లో ప్ల‌స్సే అయినా కూడా జిల్లా టీడీపీ నాయ‌కుల్లో ప్ల‌స్ అవ్వ‌లేక పోయారు. 
 
దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆదికి చెక్ పెట్టేందుకు క‌డ‌ప టీడీపీ నాయ‌కులు ఆలోచిస్తున్నార‌ట‌. 2019లో కూడా ఆదినారాయ‌ణ గెలిస్తే పార్టీ ప‌రంగా త‌మ‌కు ఎలాంటి గుర్తింపులేకుండా పోతుంద‌ని గ్ర‌హించి ఆయ‌నను ఎలాగైనా ఓడించాల‌నే ఉద్దేశ్యంతో కంకణం క‌ట్టుకున్నారు. ఇక ఇటువంటి పోరులో మంత్రి ఆదినారాయ‌ణ కుమారుడికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఛాన్స్ ఇవ్వ‌కుండా త‌న అన్న‌ కుమారుడికి ఇవ్వ‌డంతో వ్య‌తిరేకం తీవ్ర స్థాయిలో పెరిగిపోయింది. 
 
ఇక వ్య‌తిరేక శ‌క్తుల‌న్ని ఒక్క‌టై వ‌చ్చే ఎన్నిక‌ల్లో మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డిని ఓడించేందుకు సిద్ద‌మయ్యార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రోవైపు వైసీపీ నాయ‌కులు కూడా జ‌మ్మ‌ల‌మ‌డుగులో ఎలాంటి స్కెచ్ లు వేస్తారో చూడాలి. మొత్తానికి ఫిరాయింపు మంత్రి ఆదినారాయ‌ణ‌ రెడ్డికి వైసీపీ నాయ‌కుల‌తో పాటు టీడీపీ నాయ‌కులు కూడా న‌లుదిక్కులా కంచె వేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.