బందీ అయిన 40 ఏళ్ల అనుభవం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-13 17:00:18

బందీ అయిన 40 ఏళ్ల అనుభవం

జగన్ మోహన్ రెడ్డి ఈ పేరు చెపితే కొంత మంది నాయకులకు కంటి మీద కునుకు ఉండదు...ఎందుకంటే ప్రతిపక్షంలో ఉంది కేవలం నాలుగేళ్లు అయినా 40 ఏళ్ల అనుభవాన్ని సంపాదించుకున్నాడు...అవును మీరు విన్నది నిజమే ఎందుకంటే నాలుగేళ్ళ ప్రతిపక్షం, 40 ఏళ్ల అనుభవం కలిగిన చంద్రబాబుని ముచ్చెమటలు పట్టిస్తుంది కాబట్టి...జగన్ కదుపుతున్న పావులు, వేస్తున్న అడుగులు, రాజకీయ వ్యూహాలకు ప్రతివ్యూహాలతో అనుసరిస్తున్న విధానాలు చూసి పాతికేళ్ల అనుభవం కలిగిన నాయకులు కూడా ఆశ్చర్యపోతున్నారు.
 
ఎన్ని అడ్డంకులు వచ్చిన సరే ప్రత్యేక హోదా కోసం జగన్ తీసుకున్న స్టాండ్ ప్రజలతోపాటు విమర్శకులు కూడా మెచ్చుకుంటున్నారు...దీనికి కారణం కేవలం ప్రత్యేక హోదా ఒక్క విషయంలోనే కాదు...టీడీపీ చేస్తున్న అవినీతిని ప్రజల్లోకి తీసుకువెళ్లడం, ప్రత్యేక హోదా లాంటి విషయాలలో టీడీపీ ఆడుతున్న నాటకాలని బయటపెట్టడం, ఇసుక మాఫియా, విశాఖ ల్యాండ్ మాఫియా, అమరావతి భూ కుంభకోణం, అగ్రి గోల్డ్, ఇలా ఒకటా రెండా ప్రతి ఒక్క అంశంలోనూ ప్రజల తరపున ప్రతిపక్ష నేతగా పోరాడడంతో ప్రజల్లో ఆదరణ పెరిగింది...వీటన్నిటిని గమనించిన రాజకీయ విశ్లేష‌కులు కూడా జగన్ తెగువను చూసి అభినందిస్తున్నారు.
 
ఇచ్చిన మాట కోసం జగన్ ఎంతవరకైనా వెళ్తాడు అనే విషయం ప్రజలు నమ్మడంతో...జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రకి ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు...తమ బాధలు చెప్పుకోవడానికి మంచి నాయకుడు దొరికాడు అని పాద యాత్ర దగ్గరికి వేల సంఖ్యలో వచ్చి తమ బాధలను జగన్ కి చెప్పుకుంటూ జగన్ తో కలిసి కొన్ని అడుగులు వేస్తున్నారు.
 
ఇప్పటివరకూ చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో 100 టర్న్ లు తీసుకోవడంతో యూ టర్న్ అంకుల్ అయ్యారని ప్రజలు అనుకుంటున్నారు...చంద్రబాబు ఎన్నికలు దగ్గరికి వస్తే ఒకలా , ఎన్నికలు లేకపోతె మాట్లాడడం ప్రజలు గమనించారు...అందుకే చంద్రబాబుపై ప్రజలు బహిరంగంగానేదుమ్మెత్తిపోస్తున్నారు.ఈ నాలుగేళ్ళ కాలంలో చంద్రబాబు తనని తాను పొగుడుకోవడం తప్ప రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
 
నాలుగేళ్ళ నుండి జగన్ ఒకే వ్యూహాన్ని అనుసరించ‌డంతో, ఈ వ్యూహాన్ని ఛేదించలేక టీడీపీ తికమక పడి ఈ వ్యూహంలోనే చిక్కుకుంది...ఇలా జగన్ వేస్తున్న ప్రతి వ్యూహంలో టీడీపీ చిక్కుకుంటుంది తప్ప బయటకు రాలేకపోతుంది...ఒక వేళ టీడీపీ ఏదైనా వ్యూహాన్ని రచిస్తే, జగన్ ఆ వ్యూహాన్ని బద్దలు కొడుతున్నారు...దీంతో టీడీపీకి జగన్ కొరకరాని కొయ్యల మారిపోయాడు అని టీడీపీ అధినేత, టీడీపీ నాయకులు తల బద్దలుకొట్టుకుంటున్నారు.

షేర్ :

Comments

1 Comment

  1. కుడితిలో పడ్డ ఎలుక పరిస్థితి చంద్రబాబుది

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.