టీడీపీని అడ్డంగా ఇరికించిన జ‌గ‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-21 11:43:13

టీడీపీని అడ్డంగా ఇరికించిన జ‌గ‌న్

తెలుగుదేశం నాయ‌కుల స‌మాధానాలు లేవు... నిధుల‌కు లెక్క‌లు చెప్పం అని ఖ‌రాఖండిగా చెబుతుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దీనిపై ఉడుం ప‌ట్టులా ప‌డుతోంది.. పోల‌వ‌రం మొద‌లు అమ‌రావ‌తి నిధుల చిట్టా విప్పాల్సిందే, ఆ తర్వాతే ప్యాకేజీలో కేటాయింపులు అనేలా కేంద్రంలో పెద్ద‌లు సూచిస్తున్నారు.. అయితే తెలుగుదేశం నాయ‌కులు మాత్రం ఆ నిధుల చిట్టాని విప్పడానికి సుముఖ‌త  చూప‌డం లేదు.
 
తెలుగుదేశం నాయ‌కులు చెప్పే వాటికి ఇక్క‌డ క‌నిపించే వాస్త‌వాల‌కు ఎటువంటి పొంత‌న లేదు... దీంతో బీజేపీ ఏపీకి ఎటువంటి నిధులు - స‌హాయం చేయ‌డం లేదు అనే రీతిన మాట్లాడుతోంది. బీజేపీని ఏపీలో ఆత్మ‌ర‌క్ష‌ణ‌కు ప‌డేస్తున్నారు చంద్ర‌బాబు.. అయితే బీజేపీ అన్నింటిని గుర్తించింది... ఏపీకి ఎటువంటి నిధులు ఇచ్చామో లెక్క‌ల‌తో స‌హా చెప్ప‌డానికి కేంద్రం సిద్దంగా ఉంది. ఇక్క‌డ ఏపీ క‌మ‌ల‌నాయ‌కులు  కూడా స‌రైన స‌మ‌యం చూసి దీనిపై చ‌ర్చ‌కు రానున్నారు. అలాగే కేంద్రం ప్ర‌క‌ట‌న కోసం ఎదురుచూస్తున్నారు.
 
ఇటీవ‌ల టీడీపీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్  నేరుగా ప్ర‌ధానిని టార్గెట్ చేసేలా మాట్లాడ‌టం పై.. ఇక్క‌డ క‌మ‌ల‌ద‌ళం నేత‌లు ఫైర్ అవుతున్నారు.. మిత్ర‌ప‌క్షంగా ఉండి లోక్ స‌భ‌లో ఇలా  ప్ర‌ధానిని ప్ర‌శ్నించి ఎటువంటి సంకేతం ఇవ్వాల‌ని అనుకుంటున్నారు అని ప్ర‌శ్నిస్తున్నారు. కేంద్రం ఏమీ ఇచ్చినా తెలుగుదేశానికి స‌రిపోదు.. ఇది కేంద్రం గుర్తించిన అంశం. అయితే  ఇక్క‌డ తెలుగుదేశానికి మ‌రో కాక పుట్టించే అంశం కూడా క‌నిపిస్తోంది. సీఎం స్ధానంలో ఉన్న చంద్ర‌బాబుకు ప్ర‌ధానమంత్రి అపాయింట్ మెంట్ ఇవ్వ‌డం లేదు, అదే ఇటీవ‌ల రాజ్య‌స‌భ‌కు వైసీపీ త‌ర‌పున నామినేట్ అయిన ఎంపీ విజ‌య‌సాయిరెడ్డికి ఎలా ప్ర‌ధాని అపాయింట్ మెంట్ ఇస్తున్నారు అనేది వారి వేద‌న‌.
 
ఇది ఎంత వ‌ర‌కూ స‌మంజ‌సం... 40 ఏళ్ల రాజ‌కీయ చాణిక్య‌త‌కు మీరు ఇచ్చే గౌర‌వం ఇదేనా అనేది తెలుగుదేశం రాజ‌కీయ వేద‌న‌గా క‌నిపిస్తోంది.. అయితే కేసుల కొలిమి  చంద్ర‌బాబుకు ఎలా ఉన్నా, ఏపీకి పెద్ద మైన‌స్ అయింది అంటున్నారు వైసీపీ నాయ‌కులు... ఇక మిగిలిన ప‌క్షాల ఎంపీలు కూడా అనేక సార్లు ప్ర‌ధానిని క‌లుస్తారు, వారికి ఇచ్చే గౌర‌వం సీఎం చంద్ర‌బాబుకు ఎందుకు ఇవ్వ‌డం లేదు అని తెలుగుత‌మ్ముల్లు ప్ర‌శ్నిస్తున్నారు.
 
కేంద్రం కూడా తెలుగుదేశానికి చెబుతోంది... ఫిరాయింపుల‌కు తెగ‌బ‌డిన మీ రాజ‌కీయం, మా పై రాజీనామా అస్త్రాలు ప్ర‌యోగించే వ‌ర‌కూ వ‌స్తే, తాము ఎలా ముందుకు వెళ్లాలో త‌మ‌కు తెలుసు అంటోంది.. ఇటు జ‌గ‌న్ చేసిన కామెంట్, ప‌వ‌న్ స‌పోర్ట్ తో, మొత్తం అవిశ్వాస తీర్మానంలో ఇప్పుడు అడ్డంగా తెలుగుదేశం ఇరుక్కుంది.
 
అయితే తెలుగుదేశం ఏపీ ప్ర‌యోజ‌నాలు ప‌ట్టించుకోవాలి, ఇక్క‌డ రాజ‌కీయాలు చేయ‌కూడ‌దు.. జ‌గ‌న్ మార్చి 21 న అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెడితే, అప్పుడు తెలుగుదేశం స‌పోర్ట్ చేయ‌వ‌ల‌సిందే... కాదు కూడ‌దు అంటే తెలుగుదేశానికి మ‌రోసారి ఇక్క‌డ ఘోర ప‌రాజ‌యం త‌ప్ప‌దు.. ఇప్పుడు ఇదే డైల‌మా తెలుగుదేశానికి ప‌ట్టుకుంది...ఒక‌వేళ జ‌గన్ అవిశ్వాస తీర్మానం పెట్ట‌క‌పోతే, జ‌గ‌న్ ను సెంట‌ర్ చేద్దామ‌ని అనుకున్నారు ప‌వ‌న్ -బాబు.... ఇప్పుడు జ‌గ‌న్ ఏకంగా డేట్ కూడా చెప్ప‌డం సంచ‌ల‌నాల‌కు దారి తీసింది. బాబు స‌పోర్ట్ ఇస్తారా లేదా మ‌ళ్లీ పార్ల‌మెంట్ బ‌య‌ట  నార‌ద వేషాలు, శ‌కుని పాచిక‌లు ఆడే కార్య‌క్ర‌మాలు చేయిస్తారా అని ప్ర‌జ‌లు ఆలోచిస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.