జ‌గ‌న్ కే మా మ‌ద్దతు... బాబు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-15 17:14:37

జ‌గ‌న్ కే మా మ‌ద్దతు... బాబు

వైసీపీ అధినేత ఏపీ ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రేపు కేంద్ర‌ప్ర‌భుత్వం పై అవిశ్వాస తీర్మానం పెట్ట‌డానికి రెడీ అవుతున్నారు.. అయితే ఇటు కేంద్రం పై పోరాటానికి మిగిలిన ప్రాంతీయ జాతీయ పార్టీల‌ను క‌లిసి రావాలి అని కోరారు ఇప్ప‌టికే వైసీపీ లెట‌ర్లు రాసింది.. జ‌గ‌న్ చెప్పిన విధంగా ఈ నెల 21 న అవిశ్వాసం పెడ‌దామ‌ని అనుకున్నారు అయితే రేపు ఉద‌యం ప్ర‌వేశ‌పెట్ట‌డానికి సిద్దం అయింది వైసీపీ.. ఇప్ప‌టికే నోటీసులు కూడా వైసీపీ ఎంపీ వైవిసుబ్బారెడ్డి అంద‌చేశారు.పార్ల‌మెంట్ సమావేశాలు తొంద‌ర‌గా ముగియ‌నున్న సంద‌ర్బంగా వైసీపీ ఈ బోల్డ్ డెసిషన్ తీసుకుంది.
 
తెలుగుదేశం అధినేత  చంద్ర‌బాబుకు జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కూ స‌మ‌యం ఇచ్చారు.. త‌మ‌తో క‌లిసి రావాలి అని కోరారు..తాజాగా కేంద్రం తెలుగుదేశంపై వ్య‌వ‌హారిస్తున్న తీరుతో ఏపీలో రాజ‌కీయ ప‌రిస్ధితుల‌ను ఆలోచించుకున్న చంద్ర‌బాబు తాజాగా మంత్రుల‌తో స‌మావేశం ఏర్పాటు చేసుకున్నారు.
 
ఇక వైసీపీ ప్ర‌వేశ‌పెట్ట‌బోయే అవిశ్వాస తీర్మానానికి తెలుగుదేశం మ‌ద్ద‌తు ఇవ్వాలి అని నిర్ణ‌యించింది.. సీఎం చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన స‌మావేశంలో మంత్రులు వద్దు అని చెప్పినా, తెలుగుదేశం త‌ర‌పున పార్టీలో ప‌రిస్దితులు ఆలోచించిన చంద్ర‌బాబు ఏపీ ప్ర‌యెజ‌నాల దృష్ట్యా మ‌ద్ద‌తు ఇవ్వాలి అని నిర్ణ‌యించారు.. దీంతో ఏపీలో తెలుగుదేశం వైసీపీ ఎంపీలు క‌లిసి అవిశ్వాసం పెట్ట‌నున్నారు అనేది ఫైన‌ల్ అయింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.