స‌ర్వేలో వ‌చ్చిన మార్కులు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-28 16:03:49

స‌ర్వేలో వ‌చ్చిన మార్కులు

2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న త‌రుణంలో ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు త‌న ఆధీనంలో ఓ స‌ర్వేను నిర్వ‌హిస్తున్నారు. ఈ స‌ర్వేల‌ను మొద‌టిగా టీడీపీ కంచుకోట‌గా వ‌స్తున్న‌ అనంత‌పురం, కృష్ణా, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో టీడీపీ ఎమ్మెల్యేల ప‌రిపాల‌న‌ను దృష్టిలో ఉంచుకుని స‌ర్వేను చేప‌ట్టారు.ఈ స‌ర్వేలో చంద్ర‌బాబుకు ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఈ జిల్లాల్లో ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే అత్య‌ధిక మెజారిటీతో ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచే ఛాన్స్ ఎక్కువ‌గా ఉంద‌ని ఈ స‌ర్వే తెలిపిన సంగ‌తి తెలిసిందే.
 
అయితే ఇదే క్ర‌మంలో ప్ర‌తిప‌క్ష‌నేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ల్యాణ్ ను దృష్టిలో ఉంచుకుని, 2019 ఎన్నిక‌ల్లో ఎవ‌రు ముఖ్య‌మంత్రి అవ‌బోతున్నారు అనే దానిపై ఓ వెబ్ సైట్  స‌ర్వేను నిర్వ‌హించింది. మూడు నెల‌ల పాటు నిర్వ‌హించిన ఈ స‌ర్వేలో ప‌లు కీల‌క విష‌యాలు బ‌య‌ట‌ప‌డ‌డ‌మే కాకుండా కామెంట్స్ రూపంలో ఓటింగ్ శాతం కూడా తెలిపారు నెటిజ‌న్లు.
 
ఇక ఈ వెబ్ సైట్ స‌ర్వేలో పోల్ లో వ‌చ్చిన ఫ‌లితాలు గ‌మ‌నించిన‌ట్ల‌యితే 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అవుతారు అని 68 శాతం మంది నెటిజ‌న్లు త‌మ అభిప్రాయాన్ని తెలియ‌చేశారు. అలాగే తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబుకు  36 శాతం మంది నెటిజ‌న్లు త‌మ అభిప్రాయంగా తెలియ‌చేశారు…ఇక జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ 20 శాతం ప్ర‌జ‌లు ముఖ్య‌మంత్రి అవుతారు అని అభిప్రాయ‌ప‌డ్డారు.
 
ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు 2014 ఎన్నిక‌ల ప్ర‌చారంలో నిరుద్యోగుల‌కు ఉద్యోగాలు క‌ల్పిస్తాన‌ని, ఉద్యోగాలు రాని ప‌క్షంలో నిరుద్యోగ భృతి క‌ల్పిస్తాన‌ని, అలాగే మ‌హిళ‌ల‌కు డ్వాక్రా రుణ‌మాఫి చేస్తాన‌ని చెప్పి ప్ర‌తీ ఒక్క‌రిని మోసం చేశార‌ని నెటిజ‌న్లు చెబుతున్నారు. అయితే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, చంద్ర‌బాబుకు వ్య‌తిరేకం అని, ఆయ‌న చేస్తాను అన్న‌ది మాత్రమే ప్ర‌జ‌ల‌కు తెలుపుతార‌ని అంటున్నారు. అలాగే అమ‌రావ‌తి నుంచి పోల‌వ‌రం, ప‌ట్టిసీమ కాంట్రాక్టులు ప్రాజెక్టులు మొద‌లైన అవినీతి ఆరోప‌ణ‌ల పై ప్ర‌జ‌లు విసుగెత్తిపోయారు, అందుకే ఇటువంటి ఫ‌లితాలు వ‌చ్చాయి అంటున్నారు.

షేర్ :

Comments

1 Comment

  1. Bhayya aa percentages anni add chesthe 124% vastundi koncham care tiskondi ilanti fake news rasetappudu, apaddam cheppina athikintalu undali😂😂😂😂

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.