టీడీపీకి షాక్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-01 17:57:48

టీడీపీకి షాక్

మాజీ ముఖ్య‌మంత్రి తెలుగు దేశం పార్టీ స్ధాపించిన వ్య‌క్తి , న‌టుడు, నంద‌మూరి తార‌క రామారావు నుంచి ప్ర‌స్తుత‌ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వ‌ర‌కూ సైకిల్ పార్టీకి కంచుకోట‌గా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తున్న జిల్లా అనంత‌పురం జిల్లా... ఇది జ‌గ‌మెరిగిన స‌త్యం... అయితే ఈ కంచుకోటకు  వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో  బీట‌లు వాలే అవ‌కాశం  ఉంద‌ని అధికార తెలుగు దేశం పార్టీకి చెందిన ఓ ర‌హ‌స్య స‌ర్వేలో బ‌య‌ట ప‌డింది..
 
ఇక ఈ జిల్లాలో14 అసెంబ్లీ స్థానాలు రెండు లోక్ స‌భ స్థానాలు ఉన్నాయి.. ఇక ఈ జిల్లాలో 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ కేవ‌లం రెండు అసెంబ్లీ స్థానాల‌ను మాత్ర‌మే ద‌క్కించుకుంది.. మిగిలిన అన్ని అసెంబ్లీ స్థానాల‌న్ని తెలుగుదేశం పార్టీనే కైవ‌సం చేసుకుంది.... అలాగే రెండు ఎంపీ సీట్లు తెలుగుదేశం గెలుచుకుంది.
 
అనంత‌లో  ప్ర‌జా బ‌లంతో అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు.. నాలుగు సంవ‌త్స‌రాలు గ‌డిచినా ఇంత వ‌ర‌కూ ఈ జిల్లాలో ఒక్కచోట కూడా అభివృద్ది కార్య‌క్ర‌మం చేయ‌లేదు.. దీంతో ఆ జిల్లా వాసులు టీడీపీ నాయ‌కుల‌పై అసంతృప్తితో ఉన్నారు... అయితే గ‌తంలో టీడీపీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పు డు ఎలాంటి అభివృద్దిని జ‌ర‌ప‌లేద‌ని, ఇప్పుడు అధికారంలో ఉండి కూడా ఎటు వంటి కార్య‌క్ర‌మాలు చేయ‌కున్నార‌ని అనంత ప్ర‌జ‌లు మండిప‌డ‌తున్నారు. ముఖ్యంగా జిల్లాలో కియో ప‌రిశ్ర‌మ‌ను తీసుకువ‌చ్చి మొత్తం అభివృద్దికి అదే ఐకాన్ అని చెప్పుకుంటున్నారు అని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.
 
అయితే ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న‌నేప‌థ్యంలో చంద్ర‌బాబు అనంత‌పురం జిల్లాకు అర‌కొర  నిధుల‌ను కేటాయించారు.. అయితే వాటిని ఎమ్మెల్యేలు అమ‌లు చేయ‌డంలో పూర్తిగా విఫ‌లం అయ్యారు... ప్రజ‌ల కోసం కేటాయించిన నిధుల‌ను ఎమ్మెల్యేలు త‌మ స్వార్థ రాజ‌కీయాల‌తో  ప్ర‌జ‌లకు ద‌క్కించకుండా ప‌క్క‌దారి మ‌ళ్లిస్తున్నారు అని తేలింద‌ట‌.
 
ఇక దీంతో పాటు ఈ నాలుగు సంవ‌త్స‌రాల కాలంలో క‌నీ విని ఎరుగ‌ని రీతిలో టీడీపీలో వ‌ర్గ విభేదాలు త‌లెత్తాయి.. ఈ నేపథ్యంలో తాడిప‌త్రి రాజ‌కీయ వ్య‌వ‌హారం కూడా తారా స్థాయికి చేరుకున్న సంగ‌తి తెలిసిందే... ఒక ర‌కంగా చూస్తే ఈ వ‌ర్గ విభేదాల వ‌ల్ల పార్టీకి పూర్తి స్థాయిలో న‌ష్టం వాటిల్లుతోంద‌ని ఈ స‌ర్వే పేర్కొంది... ఈ స‌ర్వే ప్ర‌కారం  ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే అధికార తెలుగు దేశం పార్టీకి కేవ‌లం మూడు స్థానాలు మాత్ర‌మే ద‌క్కుతాయ‌ని, మిగిలిన సీట్ల‌న్ని ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీకి ద‌క్కే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని ఈ స‌ర్వేలో తేలింది.
 
అయితే స‌మాచారం చంద్ర‌బాబు దృష్టికి చేర‌డంతో అనంత‌పురం ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీల‌తో క‌లిసి అమ‌రావ‌తిలో అత్య‌వ‌స‌ర స‌మావేశం ఏర్పాటు చేసిన‌ట్లు తెలుస్తోంది... ఈ స‌మావేశంలో ఒక ఎమ్మెల్యేని మిన‌హా ఇస్తే మిగిలిన వారంద‌రిపైన‌ చంద్ర‌బాబు క్లాస్ తీసుకున్న‌ట్లు తెలుస్తుంది... సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాది స‌మ‌యం ఉన్నందున ఎమ్మెల్యేలందరూ  ఇక నుంచి అయినా నియోజ‌కవ‌ర్గాల‌ను స‌క్ర‌మంగా అభివృద్ది చేయాల‌ని సూచించార‌ట‌... అబివృద్ది చేయ‌లేని ప‌క్షంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌స్తుత‌ ఎమ్యెల్యేల‌కు సీట్లు కేటాయించ‌డం కుద‌ర‌దని వారి స్థానంలో కొత్త వారికి సీట్ల‌ను కేటాయించేందుకు చంద్ర‌బాబు సిద్దంగా ఉన్నార‌ని తెలుస్తోంది.
 
ఇక ఇప్ప‌టికైనా అనంత ఎమ్మెల్యేలు త‌మ వ్య‌వ‌హార శైలిని మార్చుకుంటారో! లేక త‌మ ప‌ద‌వుల‌ను వ‌దులుకుంటారో వేచిచూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.