అక్క‌డ నుంచి లోకేష్ పోటి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-12 16:07:54

అక్క‌డ నుంచి లోకేష్ పోటి

వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర ప‌శ్చిమగోదావ‌రి నుంచి తూర్పుగోదావ‌రి జిల్లాలోకి ప్ర‌వేశించింది.. ఇటు తెలుగుదేశం ఇంకా  కొత్త రాగాలు ప‌లుకుతోంది.. జ‌గ‌న్ కు ప్ర‌జ‌ల నుంచి స్పంద‌న రావ‌డం లేదు అని విమ‌ర్శ‌లు చేస్తూనే ఉంది..అయితే ఇటుజ‌గ‌న్ పాద‌యాత్ర స‌మ‌యంలో తెలుగుదేశం కూడా ఇంట‌ర్న‌ల్ స‌ర్వేల‌తో ముందుకు వెళుతోంది.ఎవ‌రు విజ‌యానికి ద‌గ్గ‌ర‌గా ఉన్న నేత‌లు, ఎవ‌రు సీట్లు ఇచ్చినా డిపాజిట్లు కూడా రాబ‌ట్టుకోలేని నేత‌లు అనేలా, మంత‌నాలు స‌ర్వేలు జ‌రుపుతున్నారు అగ్ర‌నాయ‌కత్వం.
 
అయితే మంత్రి లోకేష్ కూడా తాజాగా ఓ ప్లేస్ నుంచి పోటీ చేయ‌డానికి ఇంట‌ర్న‌ల్ స‌ర్వేల‌లో భాగంగా ముందుకు వెళుతున్నారు అని తెలుస్తోంది. ముందుగా కుప్పం నుంచి నారా లోకేష్ పోటి చేస్తారు అనుకున్నా అక్క‌డ నుంచి సీఎం చంద్ర‌బాబుపోటీ ప‌క్కా అని ఫిక్స్ అయ్యారు, త‌ర్వాత ఆయ‌న అక్క‌డ నుంచి పెన‌మ‌లూరు అలాగే గుడివాడ‌లో పోటీ చేస్తారు అంటూ ప‌లు వార్త‌లు వినిపించాయి. అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న వార్తల ప్ర‌కారం ఆయ‌న తూర్పుగోదావ‌రి జిల్లా నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్నార‌ని తెలుస్తోంది ఇక్క‌డ తెలుగుదేశం మ‌రింత బ‌లంగాఉండ‌టం,  ప‌లు సెగ్మెంట్ల‌లో  తెలుగుదేశం బీసీ ఓటు బ్యాంకు ఉన్న చోట లోకేష్  నిల‌బ‌డాల‌ని చూస్తున్నార‌ని తెలుస్తోంది.
 
దీనిపై నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు.. అమ‌లాపురం, తుని, పిఠాపురం ఈ మూడు సెగ్మెంట్ల‌ నుంచి ఆయ‌న పోటీ చేస్తారు అని అంటున్నారు.... ఇటు హోం మంత్రి చిన‌రాజ‌ప్ప కూడా గ‌తంలో ఇక్క‌డ‌నుంచి లోకేష్ పోటీ చేస్తే బాగుంటుంది అని తెలియ‌చేశారు.. అయితే ఇప్ప‌టికే ఓ స‌ర్వే టీం త‌న ప‌నిలో ఉంద‌ని తెలుస్తోంది.. మొత్తానికి కోన‌సీమ నుంచి మంత్రి నారాలోకేష్. కృష్ణాప్రాంతం నుంచి బాల‌య్య‌, రాయ‌ల‌సీమ ప్రాంతం కుప్పం నుంచి సీఎం చంద్ర‌బాబు పోటీ చేస్తారు అని అంటున్నారు పార్టీ నాయ‌కులు.. మ‌రి చూడాలి స‌ర్వే ఫ‌లితాల బ‌ట్టీ ఎక్క‌డ‌ ఎవ‌రు పోటీ చేస్తారో తెలుస్తుంది.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.