కొడాలి నాని కోట‌లో టీడీపీ ఫెయిల్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp survey on gudivada segment
Updated:  2018-03-02 12:47:08

కొడాలి నాని కోట‌లో టీడీపీ ఫెయిల్

కృష్ణా జిల్లాలో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట‌గా మ‌ర‌ల్చుతున్నారు  ఆ పార్టీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. అక్క‌డ ఎమ్మెల్యేగా పార్టీల‌తో సంబంధం లేకుండా మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యి హ్యాట్రిక్ సాధించారు  కొడాలి నాని.. ఆయ‌న తాజాగా వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలో యువ నాయ‌కుడిగా దూసుకుపోతున్నారు.. గుడివాడ కృష్ణా జిల్లానే కాదు రాష్ట్ర‌వ్యాప్తంగా ఆయ‌న పార్టీలో కీలక నాయ‌కుడిగా ముందుకు వెళుతున్నారు.
 
ఇక మున్సిప‌ల్ కౌన్సిల్ నుంచి గుడివాడ‌లో అన్ని గ్రామాల్లో వైసీపీ జెండాను తీసి, తెలుగుదేశం జెండా ఎగుర‌వేయాలి  అనే త‌లంపుతో ఉంది తెలుగుదేశం పార్టీ.. అందులో భాగంగానే  గ‌తంలో మున్సిప‌ల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ను పార్టీ నుంచి తెలుగుదేశంలోకి చేర్చుకున్నారు తెలుగుదేశం నాయ‌కులు. ఇక వారి ఆగ‌డాల‌కు పార్టీ నియోజ‌క‌వ‌ర్గ స్ధాయి ఫిరాయింపుల‌కు తెర‌తీశారు ఇక కొడాలి ప్ర‌ధాన అనుచ‌రుడ్ని పార్టీలోకి తీసుకుంటే యువ కేడ‌ర్ మొత్తం త‌గ్గుతుంది అని భావించారు అక్క‌డ సైకిల్ పార్టీ నాయ‌కులు.
 
అందులో భాగంగా త‌ర్వాత టార్గెట్ గా  నాని ప్ర‌ధాన అనుచ‌రుడు  24 వ వార్డ్ కౌన్సిలర్ గా ఉన్న చోరగుడి రవికాంత్ ను తెలుగుదేశంలోకి తీసుకున్నారు. త‌ర్వాత  ఆయ‌న పార్టీ మారి తెలుగుదేశం నుంచి వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రెండే రెండు రోజులు పార్టీలో ఉండి మ‌ళ్లీ వైసీపీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు దీంతో తెలుగుదేశం నాయ‌కుల‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది... ఏకంగా ఇరువురు మంత్రులు  క‌లిసి ఆ నాని అనుచరుడ్ని పార్టీలో చేర్చుకోవ‌డం దీనిపై చిన బాబు పెద‌బాబు జిల్లా నాయ‌కుల‌కు క్లాస్ పీకారు అనే వార్త‌లు వ‌చ్చాయి.
 
నాని త‌న రూటు మార్చుతున్నారు అనే వార్త‌ల‌ని డిజిట‌ల్ మాధ్య‌మంలో వైర‌ల్ చేశారు తెలుగుదేశం నాయ‌కులు... నాని ఎంపీగా పోటీచేస్తారు, ఆయ‌న సోద‌రుడు ఎమ్మెల్యే అంటూ వార్త‌లు వినిపించాయి.. చివ‌ర‌కు ఆయ‌న అక్క‌డ ఓ స‌మావేశంలో  కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు తెలుగుదేశం నాయ‌కులు.. న‌న్ను ఏమీ చేయ‌లేక బుర‌ద జ‌ల్లే కార్య‌క్రమంలో భాగంగా ఇటువంటి కామెంట్లు చేస్తున్నారు అని ఆయ‌న విమ‌ర్శించారు. ఇక మ‌రోసారి తెలుగుదేశం ఇక్క‌డ స‌ర్వే చేయించింది అనే వార్తలు వినిపిస్తున్నాయి... ఈ సారి గ‌తంలో కంటే నాని గ్రాఫ్ 8 శాతం పెరిగింది అని 60 శాతం నానికి ప్ర‌జ‌లు స‌పోర్ట్ గా ఉంటే తెలుగుదేశానికి 25 శాతం, జ‌న‌సేన‌కు 8 శాతం ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు ఉంద‌ని తెలిసింద‌ట.. దీంతో స‌ర్వే చేయించిన తెలుగుదేశం షాక్ కు గురైంద‌ని నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.