2019లో టీడీపీ టార్గెట్ ఇదే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-01 17:44:00

2019లో టీడీపీ టార్గెట్ ఇదే

ప్ర‌స్తుతం ఏపీలోని రాజ‌కీయం కులాల మ‌తాల చుట్టు తిరుగుతోంది. ఎక్క‌డ ఎన్ని ఓట్లు ఉన్నాయి...ఆక‌ట్టుకోవ‌డానికి ఏం చెయ్యాలి, కాపాడుకోడానికి ఎన్ని ఎత్తులు వెయ్యాలి అనే దానిని ల‌క్ష్యంగా చేసుకుని ఏపీ పొలిటిక‌ల్ లీడ‌ర్లు అడుగు వేస్తున్నారు. వైసీపీకి కంచుకోట‌గా ఉన్న ముస్లిం మైనార్టీల‌తో పాటు క్రిస్టియ‌న్ల‌ ఓట్ల‌ను ఆక‌ర్షించేందుకు అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు అనేక ఎత్తుగ‌డ‌ల‌ను వేస్తున్నార‌ని తెలుస్తోంది. 
 
అందులో భాగంగా వైసీపీ నాయ‌కులు భార‌తీయ జ‌న‌తా పార్టీతో అంట‌కాగుతున్నార‌నే అబ‌ద్ద‌పు స‌మాచారాన్ని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్లేందుకు టీడీపీ నాయ‌కులు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే ఇందుకోసం త్వ‌ర‌లోనే ప్ర‌త్యేక కార్య‌చ‌ర‌ణ‌ కూడా నిర్వ‌హించుకోనుంద‌ట‌. 
 
ద‌ళిత తేజం త‌ర‌హాలోనే ముస్లిం, క్రిస్టియ‌న్ల‌ను ఆర్షించేందుకు ప్ర‌త్యేక కార్య‌క్ర‌యాన్ని చేప‌ట్ట‌డానికి టీడీపీ అధినాయ‌క‌త్వం స్కెచ్ సిద్దం చేసుకుంటుంద‌ట‌. బీజేపీ హాయాంలో జ‌రిగిన ముస్లింల దాడుల‌ను వారు కార్య‌క్ర‌మాలు చేసిన‌ప్పుడు ఈ ప్ర‌స్తావ‌న తీసుకురావాల‌ని టీడీపీ భావిస్తోంద‌ని తెలుస్తోంది. 
 
ఇక క్రిస్టియ‌న్ల విష‌యానికి వ‌చ్చే స‌రికి చ‌ర్చ్ లో పాప నివేధ‌న‌ను ర‌ద్దు చెయ్యాల‌నే దిశ‌గా అడుగులు వేస్తున్న కేంద్రానికి బీజేపీకి అండ‌గా నిలుస్తోంద‌నే అంశాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్లాల‌ని టీడీపీ హైక‌మాండ్ భావిస్తోంద‌ట‌. సింపుల్ గా సంప్ర‌దాయ‌కంగా వ‌స్తున్న ఓటును కాపాడుకుంటూనే ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు ఉన్న కుల మ‌తాల ఓట్ల‌ను టార్గెట్ చేస్తూ ఆక‌ర్షించేలా  టీడీపీ ఎత్తుగ‌డ‌ల‌ను వేసేందుకు సిద్ద‌మైంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.