ప‌వ‌న్ పై తెలుగుదేశం వెర్ష‌న్ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-15 15:51:03

ప‌వ‌న్ పై తెలుగుదేశం వెర్ష‌న్ ?

మొత్తానికి రెండు రోజుల వ‌ర‌కూ తెలుగుదేశాన్ని అంటిపెట్టుకుని వెళ్లిన ప‌వ‌న్, నేడు తెలుగుదేశం పై ప్లీన‌రీ వేదిక‌గా ఫైర్ అవ‌డంతో, అవినీతి బండారం బ‌ట్ట‌బ‌య‌లు చేయ‌డంతో, తెలుగుదేశం నాయ‌కులు ప‌వ‌న్ పై మండిప‌డుతున్నారు.. త‌మ విమ‌ర్శ‌ల‌కు ప‌దును పెడుతున్నారు.
 
బీజేపీ రాసిచ్చిన స్క్రిప్ట్  చేతబట్టుకుని.. వైసీపీ సహకారంతో పవన్‌ కల్యాణ్‌ తెలుగుదేశం పార్టీపై దాడికి దిగినట్లు కనిపిస్తోందని రాష్ట్ర మంత్రులు అనుమానం వ్యక్తంచేశారు. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తే కేంద్రాన్ని ఏమీ ప్ర‌శ్నించ‌లేద‌ని పవ‌న్ పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు.
 
కేంద్రం తీరుకు నిర‌స‌న‌గా ప‌వ‌న్ గ‌ళం విప్పాల్సిందిపోయి, ఇప్ప‌టి వ‌ర‌కూ త‌మ‌తో ఉండి ఇలా ప్లేట్ ఫిరాయించారు అని నిల‌దీస్తున్నారు.. అయితే సీఎం చంద్ర‌బాబుతో ప‌లువురు సీనియ‌ర్లు ఈ విష‌యం పై చ‌ర్చించారు, ఇక ఎన్నిక‌ల స‌మ‌యానికి ఇది ఆరంభంగా చూసుకోవాల‌ని, ప‌వ‌న్ పై వ్య‌క్తిగత విమ‌ర్శ‌లు చేయ‌వ‌ద్దు అని సూచించిన‌ట్లు తెలుస్తోంది.
 
రాష్ట్రానికి చేయాల్సిన సాయం విషయంలో ప్రజల ముందు బీజేపీ దోషిగా నిలబడింది. ఇందుకు టీడీపీపై ఆ పార్టీ ఆగ్రహంతో ఉంది. కోపం తీర్చుకోవడానికి పవన్‌ను రంగంలోకి దించి ఆడిస్తోంది అని ఇప్పుడు బీజేపీ పై ఆ నెపాన్ని నెట్టితున్నారు తెలుగుదేశం నాయ‌కులు..ఇక ప‌వన్ ఇప్ప‌టికే తెలియ‌చేశారు తాను ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేయ‌డానికి సిద్దంగా ఉన్నాను అని, అయినా బీజేపీ ప‌వ‌న్ క‌లిసి పోయారు అని విమ‌ర్శ‌లు చేస్తున్న తెలుగుదేశం కాస్త ఆలోచించి మాట్లాడాలి అని అంటున్నారు జ‌న‌సేన నాయ‌కులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.