వైసీపీ వైపు తిరిగిన బాబు కంచుకోట ఓట్లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ysr congress party
Updated:  2018-08-11 04:40:53

వైసీపీ వైపు తిరిగిన బాబు కంచుకోట ఓట్లు

గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్య‌మంత్రి కావ‌డానికి కీల‌కంగా మారిన‌ విశ్వ బ్రాహ్మ‌ణులు 2019 సార్వ‌త్రిక ఎన్నికల‌కు మ‌రో కీలక నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌తిప‌క్షనేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌ వైఎస్ జ‌గన్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా విశాఖ జిల్లాలో మొద‌టి అడుగు వేసిన‌ప్ప‌టి నుంచి విజ‌య‌న‌గ‌రం వ‌ర‌కు విశ్వ బ్రాహ్మ‌ణులు ఆయ‌న‌ అడుగులో అడుగు వేస్తామ‌ని వారు తీర్మానం తీసుకున్నారు. 
 
గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాద‌యాత్ర చేసిన‌ప్పుడు విశ్వ‌బ్ర‌హ్మ‌ణులు మ‌ద్ద‌తు తెలిపినందుకు ఆయ‌న ఆధికారంలో ఉన్నంత కాలం విశ్వ‌బ్ర‌హ్మ‌ణుల‌ను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నార‌ని వారు గుర్తు చేశారు. ఇప్పుడు ఆయ‌న కుమారుడు జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ ఎప్పుడు అయితే విశాఖ‌జిల్లాలోకి అడుగువేస్తారో అప్ప‌టినుంచి తాము ఆయ‌న అడుగులో అడువేస్తామ‌ని వారు స్ప‌ష్టం చేశారు.
 
కాగా ప్ర‌స్తుతం ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర మ‌రి కొద్ది నిమిషాల్లో తుని నియోజ‌క‌వ‌ర్గంలో చేరుకోనుంది. అక్క‌డ వైసీపీ నాయ‌కులు ఏర్పాటు చేసిన భారీ బ‌హిరంగ స‌భ‌లో వైఎస్ జ‌గన్ పాల్గొన‌నున్నారు. ఈ స‌భ‌లో అధికార తెలుగుదేశంపార్టీ నాయ‌కులు చేస్తున్న అవినీతి అరాచ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌నున్నారు జ‌గ‌న్.
 

షేర్ :

Comments

0 Comment