అ పని చేస్తే టీడీపీ నాయకుల జాతకాలు మారిపోతాయి..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-03 06:26:19

అ పని చేస్తే టీడీపీ నాయకుల జాతకాలు మారిపోతాయి..

వైసీపీ మహిళా నాయకురాల్లో ముందు వరుసల్లో ఉండేది రోజా, వాసి రెడ్డి పద్మ.. వీళ్లిద్దరు జగన్ పైన, వైసీపీపైన ఎవరు విమర్శలు చేసిన వాళ్లపై ఎదురుదాడికి దిగుతారు...ముఖ్యంగా చంద్రబాబుపైనా నిప్పులు చెరుగుతారు...నాలుగేళ్లు నుండి టీడీపీ చేస్తున్న అవినీతిపైనా వీళ్లిద్దరు ఎన్నోసార్లు ప్రశ్నించారు...ఇప్పుడు వాసిరెడ్డి పద్మ మహిళలకు జరుగుతున్న అన్యాయం పైన ప్రశ్నించారు...
 
చంద్రబాబు ఎప్పుడు దేశంలోనే మన రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలోకి తీసుకెళ్తా అని చెప్తూ ఉంటారు ...ఇప్పుడు దానిని చేసి చూపించారు బాబు... వెన్నుపోటు రాజకీయాలలో రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లిన అయన, తర్వాత అవినీతిలో రాష్ట్రాన్ని ముందు వరుసలో ఉంచారు...ఇప్పుడు మహిళలపై జరుగుతన్న దాడులలో మన రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నింపారు అని చంద్రబాబుపై మండిపడ్డారు వాసిరెడ్డి పద్మ ...
 
మహిళలలపై వేదించే ప్రజాప్రతినిధులలో 5 మంది తెలుగుదేశం నాయకులు పేర్లు ఏడీఆర్‌ నివేదికలో ఉన్నాయని చెప్పారు వాసి రెడ్డి పద్మ...విజయవాడ వేదికగా కాల్ మనీ, సెక్స్ రాకెట్ జరుగుతున్న చంద్రబాబు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు..ఎందుకంటే దానిపైన విచారణ జరిపిస్తే తెలుగుదేశంలో బడా నాయకుల జాతకాలు మారిపోతాయని అందుకే చంద్రబాబు భయపడుతున్నారని వాసిరెడ్డి పద్మ విమర్శించారు...
 
అయన వస్తే మహిళలకు రక్షణ ఉంటుంది అని యాడ్ ల యాడ్ లు అనుకూల మీడియా చేత ప్రసారం చేపించి అధికారాన్ని దక్కించుకున్నారు చంద్రబాబు ...ఇప్పుడేమో మీ నాయకులే మహిళలపై దాడులు చేస్తుంటే చంద్రబాబు చూసి నవ్వుకుంటున్నారని అన్నారు వాసిరెడ్డి పద్మ...

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.