టీడీపీ నేలమట్టం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-03 01:34:08

టీడీపీ నేలమట్టం

ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు. అయన ఓనమాలు నేర్చుకుంది కూడా ఆ జిల్లాలోనే...గత నలభై సంవత్సరాలుగా ఈ జిల్లా నుండే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు...కానీ ఈ జిల్లా టీడీపీకి, చంద్రబాబుకి షాక్ ఇస్తూనే ఉంటుంది...కాంగ్రెస్ నుండి ఇప్పటి వైసీపీ వరకు టీడీపీకి ఈ జిల్లాలో ఎదురుదెబ్బ తగులుతూనే ఉంది...ఈ జిల్లా నుండే మరో సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఎప్పుడు టీడీపీ పాలననను, టీడీపీ చేస్తున్న అవినీతిని ఎప్పుడు ఎండగడుతూనే ఉంటారు.
 
ఇప్పుడు మరోసారి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు భూమన. చంద్రబాబు అంత అవినీతి పరుడు ఎవరు లేరని, ఆయనకు మాట మీద నిలబడటం, నీతిగా రాజకీయాలు చేయటం రాదని ఎద్దేవా చేసారు...అప్పుడు రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ని ఒంటి చేత్తో రెండు సార్లు అధికారంలోకి తీసుకువచ్చారు...అవన్నీ మర్చిపోయి రాజశేఖర్ రెడ్డి కుమారుడిని అని కూడా చూడకుండ అక్రమ కేసులు పెట్టించింది కాంగ్రెస్.
 
అందుకే 2014 ఎన్నికలలో సుమారు 90 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ గోడలను ఒంటి చేత్తో బద్దలు కొట్టిన ఘనత వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు...ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయింది. అందుకే 2019 ఎన్నికలలో టీడీపీ గోడలను జగన్ మోహన్ రెడ్డి ఒంటి చేత్తో నేలమట్టం చేయడం ఖాయమని అన్నారు వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి.
 
జగన్ కి మాటమీద నిలబడే తత్వం, తన తండ్రి రాజశేఖర్ రెడ్డి నుండి వచ్చిందని, చంద్రబాబు జీవితంలో ఎప్పుడు ఒక మాట మీద నిలబడలేదని అన్నారు...మా పార్టీ ప్రజల మద్దతుతో నిజాయతీగా అధికారాన్ని సంపాదించుకుంటాము తప్ప, అధికారం కోసం వెన్నుపోటు రాజకీయాలు చేయమని చంద్రబాబును ఎద్దేవా చేసారు భూమన కరుణాకర్ రెడ్డి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.