వైసీపీ, టీడీపీ చెక్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-12 18:46:30

వైసీపీ, టీడీపీ చెక్

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున అత్య‌ధిక మెజారిటీతో గెలిచి ఆ త‌ర్వాత అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కుల ప్ర‌లోభాల‌కు ఆశ‌ప‌డి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు ప‌శ్చిమ విజ‌య‌వాడ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్. ఈయ‌న గ‌డిచిన ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ విజ‌య‌వాడ నియోజ‌కవ‌ర్గం నుంచి పోటీ చేసి టీడీపీ అభ్య‌ర్థి శ్రీనివాసరావుపై సుమారు 3100 పైచిలికి ఓట్ల‌తో జ‌లీల్ ఖాన్ గెలిచారు. ఆ త‌ర్వాత ఆయ‌న ఊహించ‌ని ప‌రిణామాల నేప‌థ్యంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు. 
 
జ‌లీల్ ఖాన్ టీడీపీ తీర్థం తీసుకున్నత‌ర్వాత ఓ ప్ర‌ముఖ వెబ్ సైట్ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడి  బీకాం లో ఫిజిక్స్ స‌బ్జెక్ట్ ఉంద‌ని చెప్పి ఏ విధంగా  ఫేమ‌స్ అయ్యారో మనంద‌రికీ తెలిసిందే. అప్ప‌ట్లో ఆయ‌న చెప్పిన ఈ డైలాగ్ ఏపీలో ఉన్న మీడియా ఛాన‌ల్ నుంచి నేష‌న‌ల్ మీడియాల‌ వ‌ర‌కూ దేశ వ్యాప్తంగా ఈ డైలాగ్ ను ఫేమ‌స్ చేశాయి. బహుశా ఆయ‌న వైసీపీలో ఉండి ఉంటే ఇంత ఫేమ‌స్ అయ్యేవారు కాదని చాలామంది అభిప్రాయం. ఏదీ ఏమైన‌ప్ప‌టికి జ‌లీల్ ఖాన్ టీడీపీలో చెరి త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక‌మైన చ‌రిత్ర‌ను సృష్టించార‌నే చెప్పాలి.
 
అయితే ఈ విష‌యంపై చాలా సార్లు జ‌లీల్ ఖాన్ స్పందించారు. రాష్ట్రంలో అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని వాటికంటే  బీకాం ఫిజిక్స్ పెద్దెదేమి కాద‌ని స్ప‌ష్టం చేశారు. అయితే దీనికి కూడా వైసీపీ కౌంటర్ ఇచ్చింది. అభివృద్ది పేరుతో వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు క‌దా రాష్ట్ర స‌మ‌స్య‌లు కూడా మీరే పూర్తి చేయాల‌ని ప్ర‌శ్నిస్తూ జ‌లీల్ ఖాన్ ను నోరులేప‌కుండా చేశారు ప్ర‌తిప‌క్ష‌నేత‌లు. ఒక విధంగా చెప్ప‌లంటే బీకాంలో ఫిజిక్స్ అనే మాట చెప్పి రాజ‌కీయంగా ఎంతో మైన‌స్ అనే చెప్పాలి.
 
అయితే ఈ క్రమంలో 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్త‌సున్న త‌రుణంలో మ‌ఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు జ‌లీల్ ఖాన్ నియోజ‌కవ‌ర్గంలో ఓ ర‌హ‌స్య స‌ర్వేను నిర్వ‌హించారు. ఈ స‌ర్వేల‌ ప్ర‌కారం వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌లీల్ పోటీ చేస్తే ఖ‌చ్చితంగా ఓడిపోతార‌ని తేలింది. అంతేకాదు  బీకాంలో ఫిజిక్స్ డైలాగ్ ను ప్రజ‌లు దృష్టిలో ఉంచుకుని దెబ్బ‌కొట్టేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని తెలిపింది. ఆయ‌న చ‌దువుకున్న చ‌దువుపై క‌నీస అవ‌గాహ‌న లేని వ్య‌క్తి ప్ర‌జ‌లను ఏం ఉద్ద‌రిస్తార‌ని అంటున్నార‌ట‌.
 
దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌లీల్ ఖాన్ కు సీటు ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని తెగేసి చెప్పార‌ట ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు. అయితే ఆయ‌స స్థానంలో టీడీపీ త‌ర‌పున బల‌మైన నాయ‌కుడిని బ‌రిలోకి దింపేందుకు అధిష్టానం వ్యూహ‌లు ర‌చిస్తోంది. ఇక జ‌లీల్ ఖాన్ త‌న‌కు కూతురికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల‌ని మ‌రో కొత్త ఆప్ష‌న్ ఇచ్చార‌ట‌. అయితే దీనిపై అధిష్టానం ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటుందా అనేది ఇక్క‌డ నేత‌లు ఆలోచిస్తున్నారు. 
 
ఇక దీంతోపాటు మ‌రో వార్త వెలుగులోకి వ‌స్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ జిల్లా నుంచి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కుమారుడు మంత్రి లోకేశ్ బాబు పోటీ చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక ఈ వార్త‌ నిజం అయితే ఖ‌చ్చితంగా  ఇదే నియోజ‌కవ‌ర్గం నుంచి పోటీ చేస్తార‌ని రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఒక వేళ‌ లోకేశ్ ను బ‌రిలోకి దించితో అప్పుడు జ‌లీల్ ఖాన్ ప‌రిస్థితి ఏంట‌ని చాలామంది ప్ర‌శ్న‌. 
 
ఇక మ‌రోవైపు వైసీపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌లీల్ ఖాన్ పోటీ చేస్తే ఖ‌చ్చితంగా ఆయ‌నకు చెక్ పెట్టేందుకు వ్యూహ‌లు ర‌చిస్తోంది. ఇక‌ ఇప్ప‌టికే ప్ర‌శాంత్ కిషోర్ టీమ్ కూడా ప‌శ్చిమ విజ‌య‌వాడ‌లో జ‌లీల్ ఖాన్ బ‌లం ఎంత ఉంది అనే దానిపై స‌ర్వే నిర్వ‌హించింద‌ట‌. ఆ త‌ర్వాత ప్ర‌జాధ‌ర‌ణ ఉన్న వ్య‌క్తిని వైసీపీ త‌ర‌పున పోటీ చేయించేందుకు సిద్ద‌మైంద‌ని తెలుస్తోంది. మొత్తానికి ప్ర‌తిప‌క్షంతో పాటు, టీడీపీ పార్టీ కూడా జ‌లీల్ ఖాన్ రాజ‌కీయానికి చెక్ పెట్టాయ‌నే చెప్పాలి.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.