జగన్ కి తోడుగా ఉపాధ్యాయులు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-18 16:46:41

జగన్ కి తోడుగా ఉపాధ్యాయులు

జగన్ చేస్తున్న ప్రజాసంకల్ప యాత్రకి అన్ని వర్గాల నుండి సంపూర్ణ మద్దతు లభిస్తుంది..ఇప్పటికే జగన్ పాదయత్రకి బ్రాహ్మణులు, నాయి బ్రాహ్మణులు, లాయర్లు, చేనేత కార్మికులు, ఆటో యూనియన్, మత్స్య‌ కారులు ఇలా అన్నిరకాల వాళ్ళు మద్దతు తెలిపారు.ఇప్పడు ఉపాధ్యాయ సంఘం జేఏసీ నాయకులు కూడా ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రకి మద్దతు తెలిపారు.
 
పాదయాత్రలో ఉన్న జగన్ మోహన్ రెడ్డిని కలిసిన ఉపాధ్యాయ సంఘం జేఏసీ నాయకులు తమ సమస్యలను తీర్చాలని వినతి పత్రం అందజేశారు...జిల్లా కలెక్ట‌ర్ల‌కు తమ సమస్యలు చెబితే, వాటిని పరిష్కరించకుండా, ఉపాధ్యాయులు అని కూడా చూడకుండా నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
 
జిల్లా కలెక్టర్ టీడీపీ తొత్తుగా మారారని విమర్శించారు ఉపాధ్యాయ సంఘం జేఏసీ నాయకులు...పాదయాత్రలో ఉన్న జగన్ ఉపాధ్యాయ సంఘం జేఏసీ నాయకుల సమస్యలను తెలుసుకొని, వాటి పరిష్కారానికి కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చారు..ఇలా జగన్ కి అన్ని సంఘాల నుండి మద్దతు పెరగడంతో, టీడీపీకి మింగుడుపడడం లేదు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.