పులివెందుల‌లో టెన్ష‌న్..టెన్ష‌న్...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp party tcp party image
Updated:  2018-03-04 10:49:37

పులివెందుల‌లో టెన్ష‌న్..టెన్ష‌న్...

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సొంత జిల్లా క‌డ‌ప‌లో రాజ‌కీయాలు ఒక్క‌సారిగా వేడెక్కాయి. దివంగ‌త నేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యాంలో జ‌రిగిన అభివృద్దిపై చ‌ర్చించేందుకు సిద్ద‌మంటూ క‌డ‌ప ఎంపీ వైయ‌స్ అవినాష్ రెడ్డి విసిరిన ప్ర‌తిస‌వాల్ కు తెలుగుదేశం పార్టీ స్పందించ‌డం గ‌మ‌నార్హం.
 
కాగా, పులివెందుల‌లో వైయ‌స్సార్ చేసిన అభివృద్ది పై చ‌ర్చ‌కు రావాలంటూ టీడీపీ స‌వాల్ విసిరిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. టీడీపీ స‌వాల్ పై స్పందించిన అవినాష్ రెడ్డి......ఎప్పుడు, ఎక్క‌డ చ‌ర్చ‌కు రావాలో చెప్పాల‌ని, వైయ‌స్సార్ పులివెందుల‌కు చేసిన అభివృద్ది ఏంటో  ప్ర‌జ‌లంద‌రికీ తెలుసున‌ని అన్నారు. వైయ‌స్సార్ చేసిన అభివృద్దిని వారి ఖాతాలో వేసుకునేందుకు టీడీపీ నేత‌లు ఇలా అడ్డ‌దారులు తొక్కుతున్నారంటూ అవినాష్ రెడ్డి ఎద్దేవా చేశారు. 
 
ఇరు పార్టీ నేత‌లు చ‌ర్చ‌కు సిద్ద‌మైన నేపథ్యంలో  శాంతిభ‌ద్ర‌త‌ల దృష్ట్యా పోలీసులు భారీ బందోబ‌స్తును ఏర్పాటు చేశారు. పులివెందుల‌కు వ‌చ్చే వాహ‌నాల‌ను త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. మ‌రి చ‌ర్చ‌ను కొన‌సాగిస్తారా..లేదా ఇరు పార్టీనేత‌ల‌ను పోలీసులు అడ్డుకుంటారా.... అనేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. 
 
వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో రాజకీయం వేడెక్కింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పులివెందులలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిధ్దమని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి విసిరిన ప్రతిసవాల్‌కు టీడీపీ స్పందించింది. పులివెందులలో వైఎస్సార్‌ చేసిన అభివృద్ధిపై చర్చకు రావాలని టీడీపీ నేతల సవాల్‌ విసిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ సవాల్‌ను స్వీకరించిన వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ఎప్పుడు ఏ సెంటర్‌లో చర్చకు రావాలో చెప్పాలని ప్రతి సవాల్‌ విసిరారు. దీనిపై శనివారం టీడీపీ నేత సతీష్‌ రెడ్డి ఈ నెల 4 వతేదీ (ఆదివారం) సాయంత్రం చర్చకు సిధ్దమని ప్రకటించారు.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.