సీమ‌ టీడీపీలో ఫైట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-11 16:59:59

సీమ‌ టీడీపీలో ఫైట్

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు కుమారుడు మంత్రి లోకేశ్ క‌ర్నూల్ జిల్లాలో ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిదే. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా లోకేశ్ 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున క‌ర్నూల్ అర్భ‌న్ సిటీలో ఎస్వీ మోహ‌న్ రెడ్డి పోటీ చేస్తార‌ని అలాగే ఎంపీగా బుట్టారేణుక పోటీ చేస్తార‌ని స‌భాముఖంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.
 
ఇక ఆయ‌న అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించినప్ప‌టి నుంచి క‌ర్నూల్ జిల్లాలో టీజీ ఫ్యామిలీకి ఎస్వీ మోహ‌న్ రెడ్డికి అంత‌ర‌ యుద్దం మొద‌లైంది. ఇంకా ఎన్నిక‌లకు 10 నెలలు స‌మ‌యం ఉన్న క్ర‌మంలో మంత్రి లోకేశ్ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డంతో టీడీపీ నాయ‌కులు మ‌ధ్య చిచ్చుపెట్టేశారు.
 
ఇక తాజాగా ఈ విష‌యంపై టీజీ వెంక‌టేష్ బ‌హిరంగంగానే త‌న అభ్యంత‌రాన్ని వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా టీజీ మాట్లాడుతూ, మంత్రి నారా లోకేశ్ ముఖ్య‌మంత్రి కాదు టీడీపీ అధినేత కాదు అభ్య‌ర్థుల‌ను ఎలా ప్ర‌క‌టిస్తార‌ని మండిప‌డ్డారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించే ముందు మిడ్ నైట్ స‌మ‌యంలో నిర్ణ‌యాల‌ను తీసుకుంటుంద‌ని ఆయ‌న గుర్తు చేశారు.
 
అయితే మంత్రి నారా లోకేశ్ ఎందుకు అలా నిర్ణ‌యం తీసుకున్నారో త‌న‌కు అంతుచిక్క‌డం లేద‌ని త‌న మ‌న‌సులో మాట చెప్పారు టీజీ. ఎస్వీమోహ‌న్ రెడ్డి ఏమైనా హిప్న‌టైజ్ చేసి ఉంటార‌ని టీజీ వెంక‌టేష్ వ్యంగంగా అన్నారు. సీటు కోసం ఎస్వీ మోహ‌న్ రెడ్డి ఏమైనా చేయ‌గ‌ల‌డ‌ని మండిప‌డ్డారు. స‌భ‌లో మంత్రి లోకేశ్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, తెలుగు దేశంపార్టీ ఎంపీలకు ఓట్లు వేయండి అని అనడంతో త‌న‌కు ఇప్ప‌టికి అంతుప‌ట్ట‌డం లేద‌ని టీజీ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అంతేకాదు సాధార‌ణంగా లోకేశ్ అలా మాట్లాడ‌డ‌ని కేవ‌లం ఎస్వీ మోహ‌న్ రెడ్డి స్క్రిప్ట్ ఇచ్చి ఉంటార‌ని విమ‌ర్శ‌లు చేశారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.