చిన‌బాబు మాట నో టీజీ హ్యాపీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-13 12:39:04

చిన‌బాబు మాట నో టీజీ హ్యాపీ

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో అధికార‌ తెలుగుదేశం పార్టీలో అభ్య‌ర్థుల ప్ర‌క‌టన‌ కీల‌కంగా మార‌నుంది. ఎందుకుంటే 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గానికి టీడీపీ త‌ర‌పున ఇద్ద‌రు ఇంచార్జ్ లు ఉన్నారు. ఇందులో ఇంట్ర‌స్టింగ్‌ మ్యాట‌ర్ ఏంటంటే కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ త‌ర‌పున ఊహించ‌ని విధంగా వ‌చ్చే ఎన్నిక‌ల‌కు వార‌సత్వ రాజ‌కీయాలు ఎక్క‌వ అవుతున్నాయి. అందులో రాయ‌ల‌సీమ‌లో మ‌రీ ఎక్కువ. టీడీపీ కంచుకోట అనంత‌పురం జిల్లా నుంచి సుమారు ముగ్గురు యువ నాయ‌కులు 2019 ఎన్నిక‌లకు బ‌రిలో దిగే అవ‌కాశాలు ఉన్నాయి. 
 
ఇదే క్ర‌మంలో క‌ర్నూల్ జిల్లా నుంచి కూడా ఇద్ద‌రు లేక ముగ్గురు వార‌స‌త్వ‌ రాజ‌కీయ యువ‌నాయ‌కులు టీడీపీ త‌ర‌పున రాజ‌కీయ అరంగేట్రం చేసేందుకు సిద్దంగా ఉన్నారు. ఇందుకోసం వారు జిల్లా వ్యాప్తంగా యువ‌నాయ‌కుల పేరిట‌ సంఘాల‌ను కూడా ఏర్పాటు చేసుకున్నారు.
 
టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు టీజీ వెంక‌టేష్ కుమారుడు టీజీ భ‌ర‌త్ వ‌చ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ద‌మ‌య్యారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా ప్ర‌చారం కూడా చేస్తున్నారు. త‌న కొడుకు పోటీ కోసం టీజీ వెంక‌టేష్ ఎంత అయినా ఖ‌ర్చు పెట్టాడానికి సిద్దంగా ఉన్నారు.
 
అయితే ఈ  క్ర‌మంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కుమారుడు మంత్రి నారా లోకేశ్ క‌ర్నూల్ జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లుకు క‌ర్నూల్ అర్భ‌న్ నుంచి ఫిరాయింపు ఎమ్మెల్యే మ‌ళ్లీ టీడీపీ త‌ర‌పున పోటీ  చేస్తార‌ని సభా ముఖంగా తెలిపారు. అంతే క‌దా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎస్వీ మోహ‌న్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించాల‌ని చిన‌బాబు ప్ర‌క‌టించే స‌రికి టీజీ వెంక‌టేష్ కు అంతుచిక్క‌క అల‌క చెందారు. ఇక చివ‌రిగా మంత్రి లోకేశ్ పై త‌న మ‌నసులో ఉన్న మాట‌ను ఆగ్ర‌హంతో చెప్పారు. అస‌లు మంత్రి లోకేశ్ ఎలా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తార‌ని పార్టీ అధినేతకాదు ఎమ్మెల్యే కూడా కాదు అని టీజీ మండిప‌డ్డారు. 
 
ఇక ఈ మ్యాట‌ర్ లోకి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు జోక్యం చేసుకుని టీజీని బుజ్జ‌గించే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంది. ఎందుకంటే ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న స‌మ‌యంలో టీజీ  పార్టీ నుంచి చేజారిపోకూడ‌దు అని చంద్ర‌బాబు ఆలోచించి ఆయ‌న్ని ప‌ర్స‌న‌ల్ గా పిలిచి హామీ ఇచ్చే అవ‌కాశం ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ఒకవేళ‌ క‌ర్నూల్ ల్లో ఎస్వీకి టికెట్ క‌న్ఫామ్ చేసినా కూడా నంద్యాల నుంచి పోటీ చేయించేందుకు చంద్ర‌బాబు సిద్ద‌మ‌య్యారు. అయితే టీజీ త‌న‌కు క‌ర్నూల్ జిల్లా సీటే కావాలంటే ఎస్వీకి నంద్యాల టికెట్ ఇచ్చే ఆస్కారం ఉంద‌ని తెలుస్తోంది. ఇక భూమా ఫ్యామిలీ ఈ విష‌యంపై ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి. మొత్తానికి క‌ర్నూల్ జిల్లా రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మార‌నుంది.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.