వైసీపీ బాట‌లో టీడీపీ ఎంపీలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-02 01:46:21

వైసీపీ బాట‌లో టీడీపీ ఎంపీలు

కేంద్ర ప్ర‌భుత్వం గురువారం నాడు ప్ర‌వేశపెట్టిన బ‌డ్జెట్ లో తెలుగు రాష్ట్రాల‌కు జ‌రిగిన అన్యాయంపై ఇటు తెలుగుదేశం పార్టీ నేత‌లు, అటు టీఆర్ ఎస్ నేత‌లు భ‌గ్గుమంటున్నారు. బ‌డ్జెట్ పై తెలుగు రాష్ట్రాల ఎంపీలు తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. 
 
ఈ క్ర‌మంలో బ‌డ్జెట్ పై టీడీపీ రాజ్య‌స‌భ ఎంపీ టీజీ వెంక‌టేష్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. కేంద్ర ప్ర‌భుత్వంతో యుద్దం చేసేందుకు ముందుకు వెళ్లే దిశ‌లో టీడీపీ ఆలోచ‌న‌లు చేస్తోంద‌ని,  అంచెలంచెలుగా యుద్ద ప్ర‌క్రియ ఉంటుంది..ఇందులో ఫైన‌ల్ స్టేజ్ లో బీజేపీతో తెగ‌దెంపులు ఉంటాయ‌ని టీజీ వెంక‌టేష్ స్ప‌ష్టం చేశారు. 
 
ఈ మూడు అంచెల్లో మొద‌టిది మేము కేంద్ర మంత్రి వ‌ర్గంలో ఉన్నాము.... వారు మా మంత్రి వ‌ర్గంలో ఉన్నారు...దీనిపై నిర్ణ‌యం తీసుకోవ‌డం,  రెండోది రాజీనామాలు,  ఇక మూడోది తెగ‌దెంపులు అని అన్నారు. కేంద్రంలో మెజారిటీ సీట్లు ఉన్నందునే బీజేపీ నేత‌లు  పొగ‌రుతో ఉన్నార‌ని,  ఆ పోగ‌రుకు ఫుల్ స్టాప్ పెట్టాల‌ని  అభిప్రాయ‌ప‌డ్డారు.
 
బీజేపీకి ప్ర‌తిప‌క్షంగా చంద్ర‌బాబు నిల‌బ‌డితే దేశంలో ఉన్న అన్ని పార్టీలు ఐక్యంగా ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ఇస్తాయ‌ని అప్పుడు కేంద్ర ప్ర‌భుత్వానికి ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని అన్నారు.మ‌రోవైపు వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశిస్తే తాము కూడా రాజీనామాల‌కు సిద్ద‌మంటూ వైసీపీ ఎంపీటు ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దీంతో వైసీపీ బాట‌లోనే ప్ర‌యాణించేందుకు టీడీపీ ఎంపీలు సిద్ద‌మౌతున్నారు.  
 
 
 
 
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.