చంద్ర‌బాబుకు స‌వాల్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-30 16:44:09

చంద్ర‌బాబుకు స‌వాల్

ఏపీ రాజ‌కీయాల్లో  కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు తీవ్ర దుమారం లేపుతున్నాయి. గ‌తంలో ఎన్న‌డూలేని విధంగా కేంద్ర ప్ర‌భుత్వం పై రాష్ట్రంలో ఉన్న అన్ని రాజ‌కీయ పార్టీలు మూకుమ్మ‌డిగా  పోరాటం చేస్తున్న విష‌యం తెలిసిందే. దేశ రాజ‌కీయాలు ఎంత ఉత్కంఠంగా ఉన్నాయో అదే స్థాయిలో  ఏపీలో కూడా ఉన్నాయి రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు. ఒక వైపు ప్ర‌త్యేక‌హోదా సాధించేంత వ‌ర‌కూ త‌మ పోరాటం ఆగ‌ద‌ని టీడీపీ ప్ర‌క‌టిస్తే, మ‌రో వైపు హోదా కోసం త‌మ ప‌ద‌వుల‌ను సైతం త్యాగం చేస్తామ‌ని వైసీపీ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ప్ర‌త్యేకహోదా పై ఇరు పార్టీల నాయ‌కులు ఒక‌రి పై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. 
 
తాజాగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర  అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం సీఎం చంద్రబాబుపై తీవ్ర  స్థాయిలో ధ్వజమెత్తారు....ప్ర‌త్యేక‌హోదా కోసం టీడీపీ ఎంపీల‌తో ఎందుకు రాజీనామా చేయించ‌డం లేద‌ని అన్నారు.. రాష్ట్రంలోని 25 మంది ఎంపీలు ఏకతాటిపైకి వచ్చి రాజీనామా చేస్తే కేంద్రం దిగిరాదా అని ఆయన ప్రశ్నించారు.. కేంద్రంతో లోపాయికారి ఒప్పందం ఏమైనా చేసుకున్నారా అని చంద్ర‌బాబుని అడిగారు.
 
విజయవాడ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో  తమ్మినేని సీతారాం మీడియాతో మాట్లాడుతూ ఐదుకోట్ల మంది ఆంధ్రుల ఆకాంక్ష ఒక్క‌టైనా ప్రత్యేక హోదా పోరాటానికి ఇప్పటికైనా కలసిరావా చంద్రబాబూ అని ఆయన నిలదీశారు. మీకు స్వార్థప్రయోజనాలే తప్ప రాష్ట్రప్రయోజనాలు పట్టవా అని ప్రశ్నించారు... ఓటుకు కోట్లు కేసు వల్ల భయపడుతున్నావా లేక పోలవరంలో మీ అవినీతి బయటపడుతుందన్న భయమా అని అన్నారు.
 
నాలుగేళ్లుగా రాష్ట్రంలో అన్ని రంగాలనూ అవినీతిమయం చేసిన చంద్రబాబు ఆ అవినీతిపై ఎక్కడ కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు జరిపిస్తుందోనని భయపడుతున్నారని అన్నారు.  టీడీపీ ప్ర‌భుత్వం చేసిన అవినీతి, నేరాలు, ఘోరాలపై సీబీఐ విచారణ చేపట్టాలని కేంద్రాన్ని కోరుతున్నామ‌ని తెలిపారు.  దేశంలోనే ముఖ్యమంత్రి పదవికే చెడ్డ పేరు తెచ్చిన వ్యక్తి చంద్రబాబు అని విరుచుకుపడ్డారు. అందర్నీ ఆర్ధిక నేరస్తులు అంటున్న చంద్రబాబు తనపై వున్న 18 స్టేల‌ అభియోగాలపై సీబీఐ విచారణ చేయించుకుంటారా అని నిలదీశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.