అమ‌రావ‌తికి అప్పులు ప్ర‌జ‌ల చేతికి చిప్ప‌లు ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

amaravathi image
Updated:  2018-03-31 11:39:59

అమ‌రావ‌తికి అప్పులు ప్ర‌జ‌ల చేతికి చిప్ప‌లు ?

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి రాజ‌ధాని కోసం 33 వేల ఎక‌రాల భూమిని రైతుల నుంచి తీసుకున్న విష‌యం తెలిసిందే... రైతుల ద‌గ్గ‌ర నుంచి తీసుకున్న భూమిలో ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి నిర్మాణాలు చేప‌ట్ట‌లేదు తెలుగుదేశం స‌ర్కార్‌.... నాలుగు సంవ‌త్స‌రాల కాలం ముగిసిన త‌ర్వాత ఇటీవ‌ల అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణానికి ప్ర‌జ‌లు అప్పు ఇవ్వాల‌ని సీఎం చంద్ర‌బాబు కోరిన విష‌యం తెలిసిందే.
 
దీనిపై ప్ర‌జ‌ల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి అమ‌రావ‌తికి ఇటుక‌ల రూపంలో డ‌బ్బులు ఇచ్చాము అని ఆ డ‌బ్బుల‌తో ఏం చేశారో కూడా తెలియ‌దని ప్ర‌తీ ఒక్క‌రికి ఓ డిజిట‌ల్ పేప‌ర్ పంపించారు అని విమ‌ర్శ‌లు చేస్తున్నారు.. అయితే ఎమ్మెల్యేలు మంత్రులు దోచుకున్న దానితో రాజ‌ధాని క‌ట్ట‌చ్చు క‌దా అని కూడా విమ‌ర్శ‌లు చేస్తున్నారు.. విశాఖ భూకుంభ‌కోణంతో ప్ర‌పంచ మేటి రాజ‌ధానులు నాలుగు నిర్మించ‌వ‌చ్చు అని వైసీపీ అంటోంది. 
 
ఇటు నా బార్డు త‌ర‌పున ఏసియ‌న్ బ్యాంకు త‌ర‌పున జ‌పాన్ బ్యాంకు త‌ర‌పున సింగ‌పూర్ త‌ర‌పున పెట్టుబ‌డులు తీసుకువ‌చ్చి రాజ‌ధాని నిర్మిస్తాం అన్నారు... ఆ పని చేయ‌కుండా కాయా క‌ష్టం చేసుకుని బ్ర‌తికే వారిని రాజ‌ధానికి డ‌బ్బులు ఇమ్మంటే ఎలా అంటున్నారు?  పోని మీ మంత్రులు ఎమ్మెల్యేలు ఓ సంవ‌త్స‌రం జీతాలు వ‌దిలెయ‌వ‌చ్చు క‌దా?  హెరిటేజ్ లాభాలు ఆరునెల‌లు ఇవ్వ‌చ్చు క‌దా ? ఇసుక లాభాలు ఇవ్వ‌చ్చు క‌దా? ఈ ప్లైట్లు ప్ర‌యాణాలు రిచ్ లుకింగ్ కోసం చేసే ఖ‌ర్చులు?  80 రూపాయ‌ల మంచినీళ్ల బాటిళ్లు?  ఈ ఖ‌ర్చులు త‌గ్గించవ‌చ్చు క‌దా అంటే నో అంటారు నాయ‌కులు.
 
మ‌రి అలాంటిది దానికి....  2014 ఎన్నిక‌ల్లో ఎందుకు బాబుగారు నా సీనియార్టీని చూసి ఓటువెయ్యండి అని ప్ర‌జ‌ల‌ను అడిగారు? అమ‌రావ‌తి నేనే నిర్మిస్తా అని ఎలా అన్నారు...ఇలా డ‌బ్బులు ప్ర‌జ‌ల నుంచి తీసుకుని మీరేంటి ఏ తాపీ మేస్త్రి అయినా నిర్మిస్తాడు అనేది ప్ర‌జ‌ల వాద‌న‌. ముందు ప్రజారాజ‌ధాని క‌ట్ట‌డానికి ఆలోచ‌న చేయండి, అప్పుడు ప్ర‌జ‌లే డబ్బులు ఇస్తారు అంటున్నారు వైసీపీనాయ‌కులు.
 
ఇప్ప‌డు ప్ర‌జ‌ల నుంచి అప్పుతీసుకుని ఆ అప్పు తిరిగి నేను మీకు చెల్లించాలి అంటే మ‌ళ్లీ నాకే ఓటు వెయ్యండి అని వ‌చ్చే ఎన్నిక‌ల్లో అడగ‌టానికి చంద్ర‌బాబు ప్లాన్ వేస్తున్నారు అని ,వైసీపీ అప్పుడే టార్గెట్ కూడా చేసింది... ఆ రేవంత్ 50 ల‌క్ష‌లు ఇచ్చాడు ఆ డ‌బ్బు ఉంటే ప‌రిపాల‌న భ‌వ‌నాల‌కు శ్లాబులు కూడా వేయ‌వ‌చ్చు అంటున్నారు వైసీపీ నాయ‌కులు.. వాట్ ఎవ‌ర్ క‌మిటిమెంట్స్ బ‌య‌ట‌కాకుండా అమ‌రావతిలో చేస్తే అన్నీనిర్మించ‌వ‌చ్చు అనేది వైసీపీ వాద‌న. 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.