నాటకాల నాయుడిని తరిమికొట్టాలి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp
Updated:  2018-04-08 11:57:18

నాటకాల నాయుడిని తరిమికొట్టాలి

రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తు ప్రత్యేక హోదాతోనే సాధ్యమని జననేత జగన్ మోహన్ రెడ్డి అదేషానుసారం తమ పార్లమెంట్ సభ్యత్వం తృణపాయంగా భావించి రాజీనామాలు చేయించారు.. అంతే కాదు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రత్యేక హోదా కోసం  వైసీపీ ఎంపీలు ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేస్తున్న వారికి మద్దతుగా వైసీపీ కువైట్ సభ్యులు సంఘీభావం తెలియజేసారు.
 
ప్రత్యేక హోదా ఇక సమసిపోయిన అధ్యాయం అని చెప్పిన తెలుగుదేశం నాయకుల చేతనే ప్రత్యేక హోదా నినాదం పలికించిన నాయకుడు జననేత జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. ఈ రోజు ప్రత్యేక హోదా సజీవంగా ఉందంటే ఒకే ఒక నాయకుడు జగన్ వల్లేనని తెలిపారు... వారి ఆదేశానుసారం  సుమారు 15 నెలల సమయమున్న ప్రత్యేక హోదా కోసం తమ పదవులను వదులుకొని ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పార్టీ లోక్ సభ సభ్యత్వానికి రాజీనామాలు చేసిన పార్లమెంట్ సభ్యులకు వైసీపీ కువైట్ సభ్యుల తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు కువైట్ కన్వినర్ బాలిరెడ్డి.
 
ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ.. పార్లమెంట్ సాక్షిగా ఒక నాయకుడు ఆంధ్రకు 10 సంవ‌త్స‌రాలు అవసరమని చెప్పారు... పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీ. వేంకటేశ్వర స్వామి సాక్షిగా అప్పటి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పార్లమెంట్ లో వాళ్ళ నాయకుడు చెప్పిన మాటలను గుర్తు చేస్తూ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా 10 సంవ‌త్స‌రాలు ఇస్తామని హామీ ఇవ్వడం, నాటకాల రాయుడు చంద్రబాబు ఒక అడుగు ముందుకేసి 10 సంవ‌త్స‌రాలు కాదు 15 సంవ‌త్స‌రాలు ప్రత్యేక హోదా కావాలని అన్నారు... అధికారంలోకి వచ్చిన తర్వాత ఊసరవెల్లి రంగులు మార్చినట్లు ప్రత్యేక హోదాపై మాటలు మార్చినటువంటి నాటకాల నాయకుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మన రాష్ట్ర ప్రజల దురదృష్టమని ఎద్దేవా చేశారు. నాటకాల నాయుడిని 2019 లో ఓటుతో తరిమికొట్టాలని మండిపడ్డారు కువైట్ కో కన్వీనర్లు గోవిందు నాగరాజు, యం .వి. నరసా  రెడ్డి
 
ఈ కార్యక్రమములో ప్రధాన కొసశాధికారి నాయని మహేశ్వర్ రెడ్డి, బి.సి. ఇంచార్చ్ కె. రమణ యాదవ్, రవింద్ర నాయుడు, సలహాదారుడు నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, యూత్ ఇంచార్చ్ మర్రి  కళ్యాణ్, ఎస్సి. ఎస్టీ. ఇంచార్చ్  బి. యెన్. సింహా , కోశాధికారి పిడుగు సుబ్బారెడ్డి, యూత్  సభ్యుడు బాల కృష్ణ రెడ్డి, సేవాదళ్ వైస్ ఇంచార్జి కె.నాగసుబ్బారెడ్డి, మరియు సుబ్బయ్య తదితరులు పాల్గోన్నారు..

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.