జ‌గ‌న్ ర్యాంకు వెనుక అస‌లు రీజ‌న్ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jaganmohan reddy image
Updated:  2018-03-31 01:21:06

జ‌గ‌న్ ర్యాంకు వెనుక అస‌లు రీజ‌న్ ?

ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ జాబితాలో మొద‌టి స్దానంలో అంద‌రూ ఊహించిన విధంగా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ పేరు వ‌చ్చింది. ఈ శ‌క్తిమంతుల జాబితాలో అస‌లు రాజ‌కీయనాయ‌కులేనా ఇక మిగిలిన వారికి శ‌క్తి లేదా అంటే, గుర్తించే వారే లేరు అంటున్నారు చాలా మంది.... అయితే ఉత్త‌రాధి నాయ‌కులు ద‌క్షిణాది రాజ‌కీయ నాయ‌కులు మంచి స్ధానాలే పొందారు. రాజ‌కీయ నాయ‌కులు త‌మ స్ధానాల‌ను ప‌దిలంగా చేసుకున్నారు.
 
అయితే ఇక్క‌డ గుర్తించాల్సింది తెలుగు రాష్ట్రాల నుంచి జ‌గ‌న్ అత్యంత శ‌క్తివంత‌మైన వ్య‌క్తిగా ఆ జాబితాలో నిలిచాడు.. నిల‌వ‌డం కాదు ఏకంగా ఇటు సీఎం చంద్ర‌బాబుని అటు సీఎం కేసీఆర్ ని వెన‌క్కి మ‌రీ నెట్టేశారు.. అది ఇక్క‌డ చ‌ర్చించుకోవాల్సిన విష‌యం.
                   
ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ జాబితాలో 
అమిత్ షా రెండో స్థానం
దీప‌క్ మిశ్రా మూడ‌వ స్ధానం
మోహ‌న్ భ‌గ‌వ‌త్ నాల్గ‌వ స్ధానం
సోనియాగాంధీ ఐదో స్థానం
మమతా బెనర్జీ ఆరో స్థానం
ఏడ‌వ‌స్ధానంలో రాజ్ నాథ్ సింగ్
అరుణ్ జైట్లీ ఎనిమిదోవ స్దానం
యోగిఆదిత్యానాధ్ తొమ్మిద‌వ‌స్ధానం
ముఖేష్ అంబానీ 10వ స్థానంలో నిలిచారు
రాహుల్‌ గాంధీ  11 వ స్థానంలో నిలిచారు
12 నితిన్ గడ్కరీ, 
13 శివరాజ్ సింగ్ చౌహాన్, మధ్యప్రదేశ్ సీఎం
14 మాయావతి
15 అఖిలేష్ యాదవ్, 
16 దేవేంద్ర ఫడ్నవీస్, మహారాష్ట్ర సీఎం
17 లాలూప్రసాద్ యాదవ్
18 తేజస్వి యాదవ్ 
19 సిద్ధరామయ్య కర్నాటక సీఎం
20 విరాట్ కోహ్లీ ఇది టాప్ 20 జాబితా
 
ఇక తెలుగు రాష్ట్రాల్లో చ‌ర్చించుకుంటే వైఎస్ జగన్‌ అత్యంత శక్తిమంతులైన భారతీయుల జాబితాలో 35వ స్థానంలో ఉన్నారు....ఈ జాబితాలో 36వ స్థానం చంద్ర‌బాబుకు  దక్కింది..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు  శక్తివంతుల జాబితాలో 52వ స్థానం దక్కింది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు 58వ స్థానంలో ఉన్నారు ..అయితే స‌ర్వేలు జాబితాలు ఓ ప‌ద్ద‌తి ఓ నియ‌మావ‌ళి ప్ర‌కారం జ‌రుగుతాయి.. ఇక్క‌డ ఈ సంస్ద ఎటువంటి లెక్క‌ల‌తో ఈ జాబితా ఇచ్చిందొ తెలియ‌దు.. ప్ర‌ముఖ ప‌త్రిక - అలాగే పాఠ‌కుల‌కు మ‌క్కువ కాబ‌ట్టి ఈ జాబితా స‌ర్కులేట్ అయింది.. అయితే ఇక్క‌డ తెలుగురాష్ట్రాల్లో సీఎం కేసీఆర్, అలాగే  40 ఇయ‌ర్స్ పొలిటిక‌ల్ ఇండ‌స్ట్రీ లో అనుభ‌వం ఉన్న ప‌ర్సెన్ చంద్ర‌బాబు నాయుడు... వీరిని  కూడా దాటి జ‌గ‌న్ ముందుకు వెళ్ల‌డం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చ‌ర్చకు దారితీసింది.
 
అయితే కేంద్రంపై పోరాటం అనే అగ్గి  బాబుకు ర్యాంకు త‌గ్గించిందా అంటే ఏమో ఎన్డీయే త‌ర్వాత వ‌చ్చిన రిపోర్టు అది కూడా ఆలోచించాలి అంటున్నారు తెలుగుదేశం నాయ‌కులు నిజ‌మే వారి ఆలోచ‌న అర్జునుడి లెక్క ఉంటుంది... అయితే నాడు జ‌గ‌న్ వంద లిస్టులో ఎప్పుడూ లేరు, నేడు ఏకంగా తెలుగు వ్య‌క్తుల్లో టాప్ గా నిలిచారు... నిజ‌మే ఇక్క‌డ మాత్రం ఎక్స‌ప్రెస్ చెప్పిన మాట‌లు క‌రెక్ట్ అనిపిస్తోంది.
 
గ‌త నాలుగేళ్లుగా జ‌గ‌న్ చేసిన పోరాటం ఓఎత్తైతే  ఓ నాలుగు నెల‌లుగా చేస్తున్న పోరాటం మ‌రో ఎత్తు.. అందుకే ఆ ఎత్తుకు వ‌చ్చారు జ‌గ‌న్ అనేది ప‌త్రిక తెలియ‌చేస్తోంది. అది జ‌గ‌న్ అందుకే ఆ ర్యాంకుకు వెళ్లారు ఇక్క‌డ మ‌ర్చిపోతున్న అంశం  ఒక‌టి ఉంది...భావి సీఎం అని తెలుగుదేశం నాయ‌కులు చెబుతున్న మంత్రి  నారా లోకేష్ పేరుమాత్రం ఇక్క‌డ లేదు...ఆయ‌న పేరు ఎందుకు ఉండాలి అంటే ఉదాహ‌ర‌ణ చెప్పుకోవచ్చు.
 
తేజస్వి యాదవ్, బీహార్ ప్రతిపక్షనేత, లాలూ కొడుకు 18 స్ధానంలో ఉన్నారు..సో లోకేష్ కంటే వ‌య‌సులో చిన్న అనుభ‌వంలో చిన్న, మ‌రి అది ఎవ‌రూ గుర్తించ‌రు.. ఇక అఖిలేష్ ర్యాంకు తెలిసిందే గా సీఎంల త‌న‌యుల ర్యాంకులు చ‌ర్చించుకోపోతే రాజ‌కీయాలు ఎలా న‌డుస్తాయి సారు....
 
విశ్లేష‌ణ !! గణేష్. వి 
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.