బాబు డైరెక్ష‌న్ లోనే ఈ దాడి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-11 07:27:06

బాబు డైరెక్ష‌న్ లోనే ఈ దాడి

బీజేపీ అధ్య‌క్ష‌డు  అమిత్ షా క‌ర్నాట‌క‌ ఎన్నిక‌ల ప్ర‌చారం ముగించుకుని ఈ రోజు వెంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకునేందుకు ప్ర‌త్యేక వాహ‌నంలో తిరుప‌తికి చేరుకున్నారు.. అయితే ఈ క్ర‌మంలో ఆయ‌న తిరుప‌తికి వ‌స్తున్నార‌నే స‌మాచారం టీడీపీ నాయ‌కుల‌కు తెలియ‌డంతో  అమిత్ షావాహ‌నాన్ని అడ్డ‌కునే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మై టీడీపీ నాయ‌కుల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను అడ్డ‌కునే ప్ర‌య‌త్నం చేశారు. త‌మ‌ను అడ్డుకున్నార‌నే ఆవేశంతో కారులో వెళ్తున్న అమిత్ షా పై టీడీపీ నాయ‌కులు రాళ్ల‌తో దాడి చేసిన సంగ‌తి తెలిసిందే.
 
ఇక తాజాగా ఈ ఘ‌ట‌న‌పై రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయ‌కులు మండిప‌డుతున్నారు. ఈ ఘ‌ట‌న చంద్ర‌బాబు డైరెక్ష‌న్ లోనే జ‌రిగింద‌ని ఆరోపిస్తున్నారు.  ఈ నేప‌థ్యంలో అమిత్ షా ఘ‌ట‌న‌పై ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పందించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, త‌మ నాయ‌కుడు అమిత్ షా దాడిపై  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక విధంగా స్పందిస్తే, హోం మంత్రి చినరాజప్ప మరో విధంగా స్పందించారని ఆయ‌న మండిప‌డ్డారు. 
 
అందుకే తాను ఎప్పుడు టీడీపీ డ్రామాల పార్టీ అని పిలుస్తాన‌ని, ఈ ఘ‌ట‌న‌పై ఒక్కొ నాయ‌కుడు ఒక్కొ విధంగా స్పందిస్తున్నార‌ని, అయితే మొత్తం మీద ఈ దాడి టీడీపీ డైరెక్షన్ లో మాత్రం జ‌రిగింద‌ని త‌మ‌కు స్ప‌ష్టంగా తెలుస్తోంద‌ని అన్నారు. ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిపై దాడి జరగడమంటే మామూలు విషయం కాదని,  ఈ దాడి చేసిన తెలుగుదేశం గూండాలను వేంట‌నే జైల్లో పెట్టాలని సోము వీర్రాజు  డిమాండ్ చేశారు. అలాగే ఈ దాడి వెనుక చంద్రబాబు ఉన్నారని ఆయ‌న‌పై కుడా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.