ఆ ఎమ్మెల్యే ప్ర‌ధాన ల‌క్ష్యం ఇదే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-03 04:59:49

ఆ ఎమ్మెల్యే ప్ర‌ధాన ల‌క్ష్యం ఇదే

కాకినాడ‌ ప్ర‌శాంత‌వంత‌మైన వాతావ‌ర‌ణంగా భావించి ఈ న‌గ‌రంలో ప‌ద‌వీ విర‌న‌ణ చేసిన చాలా మంది ఉద్యోగులు ఈ న‌గ‌రంలో సెటిల్ అవుతుంటారు. దీంతో ఈ న‌గ‌రాన్ని పెంక్ష‌న‌ర్స్ ప్యార‌డైజ్ అని కూడా పిలుస్తుంటారు.  రెండుపోర్ట్ లు, ఎరువుల, కారాగారాలు, ఎడిబిల్ ఆయిల్ పరిశ్ర‌మ‌లు, ఆయిల్ గ్యాస్ కార్య‌క‌లాపాల కార‌ణంగా రాష్ట్రంలో కాకినాడ‌కు ప్ర‌త్యేక గుర్తింపు వ‌చ్చింది. కాకినాడ సిటీ అసెంబ్లీ సెగ్మెంట్ లో2 ల‌క్ష‌ల‌7వేల 571మంది ఓట‌ర్లు ఉన్నారు. అయితే వీరిలో దాదాపు 45వేల‌కు పైగా మ‌త్స్య‌కారులకు చెందిన సామాజిక వ‌ర్గం వారికి ఓట్లు ఉన్నాయి. ఇక  వీరి త‌ర్వాత కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన ఓట్లు సుమారు 40వేల‌ ఉన్నాయి. ఆ త‌ర్వాత స్థానంలో బీసీ ఎస్సీ ఓట్లు ఉంటాయి. 
 
 
2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాకినాడ సిటీ సెగ్మెంట్ నుంచి టీడీపీ త‌ర‌పున పోటీ చేసిన వెంక‌టేశ్వ‌ర‌రావు వైసీసీ తర‌పున పోటీ చేసి వైసీపీ అభ్య‌ర్థి ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్ రావు పై 24వేల ఓట్ల ఆధిఖ్య‌త గెలిచారు. న‌గ‌రానికి ప్ర‌ధానంగా డ్రైనేజీ డంపింగ్ యార్డ్ అలాగే ట్రాఫిక్ స‌మ‌స్య‌లు అధికంగా ఉన్నాయి. అయితే 2014లో వెంక‌టెశ్వ‌ర‌రావు ఈ స‌మ్య‌స‌ల‌నే ఎజెండాగా చేసుకుని ఎన్నిక‌లుకు వెళ్లి విజ‌యం సాధించారు. పేరుకు మాత్ర‌మే కాకినాడ న‌గ‌రం స్మార్ట్ సిటీనే కానీ న‌గ‌రంలోకి అడుగు పెట్ట‌గానే చాలా చోట్ల మురికి, చెత్తా చెదారంతో కూడిన వాతావ‌ర‌ణం క‌నిపిస్తుంది. 
 
ప్ర‌తీ రోజు 220 ట‌న్నుల‌ చెత్త‌ను కాకినాడ మున్నిప‌ల్ కార్పోరేషన్ సేక‌రిస్తుంది. వారు సేక‌రించిన చెత్త‌ను డంపింగ్ యార్డ్ లో ప‌డెస్తారు. అయితే ఈ యార్డ్ ను ఇక్క‌డినుంచి త‌ర‌లించాల‌ని డిమాండ్ చేస్తూ అక్క‌డి ప్ర‌జ‌లు నిర‌స‌న‌లుచేస్తూనే ఉన్నారు. కానీ ఎమ్మెల్యే మాత్రం ఆందోళ‌న కారుల‌కు ముఖం చూపించ‌కుండా త‌ప్పించుకుంటూ తిరుగుతున్నారు. కాకినాడ‌లో ప్ర‌ధాన‌ స‌మ‌స్యలో ఒక‌టి డ్రైనేజ్ స‌మ‌స్య. అయితే త‌న‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే డ్రైనేజ్ స‌మ‌స్య‌ను తీరుస్తాన‌ని వెంక‌టేశ్వ‌ర‌రావు హామీ ఇచ్చారు. అయితే ఆయ‌న ప్ర‌జ‌ల‌తో ఓట్లు చేయించుకున్నారు. కానీ  ఈ స‌మ‌స్య‌ను అలానే ఉంచారు. దీంతో న‌గ‌రంలో చిన్న‌పాటి వ‌ర్షం వ‌స్తే చాలు ఊట చేరులు క‌నిపిస్తాయి. 
 
బౌగోళికంగా చూస్తే కాకినాడ ప్రాంతం సముద్రానికి నాలుగు అడుగులు కిందికే ఉంటుంది. దీంతో వ‌ర్షం కురిసిన‌ప్పుడు వ‌ర‌ద‌నీరు స‌ముద్రంలోకి క‌ల‌వ‌టాకిని  వీలులేకుండా పోయింది. అందువ‌ల్ల కాకినాడ‌కు పంపింగ్ డ్రైనేజ్ సిస్ట‌మ్ అవ‌స‌రం అని అధికారులు సూచించారు. అయితే  అది అమ‌లు చేయ‌టంలో టీడీపీ ఎమ్మెల్యే విఫ‌లం అయ్యారు. న‌గ‌రంలో ఉన్న స‌మ‌స్య‌ల‌ను మ‌రిచిపోయి త‌న అనుచ‌రుల స‌హాయంతో అఘాయిత్యాల‌కు పాల్ప‌డుతున్నార‌ని వైసీపీ నాయ‌కులు మండిప‌డుతున్నారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.