ఈ నెల 29న వైసీపీ బంద్ కు పిలుపు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-21 17:49:46

ఈ నెల 29న వైసీపీ బంద్ కు పిలుపు

క‌డ‌ప ఉక్కును డిమాండ్ చేస్తూ ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డి పుట్ట‌ప‌ర్తిలో సుమారు 48 గంట‌ల పాటు నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఈ దీక్ష అనంత‌రం రాచ‌మ‌ల్లు మీడియాతో మాట్లాడుతూ అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కుల‌కు స‌వాల్ విసిరారు.
 
తాము క‌డ‌ప ఉక్కు సాధ‌న కోసం నాలుగు సంవ‌త్సరాల నుంచి చిత్త‌శుద్దితో ప‌ని చేస్తున్నామ‌ని అన్నారు. కానీ టీడీపీ నాయ‌కులు మాత్రం 2019 సార్వ‌త్రిక ఎన్నికలు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో ఓట్లను రాబ‌ట్టుకునేందుకు దొంగ దీక్ష‌లు చేస్తున్నార‌ని రాచ‌మల్లు మండిపడ్డారు.
 
అంతే కాదు తాము స్టీల్ ప్లాంట్ సాధ‌న‌ కోసం త‌మ ప‌ద‌వులకు రాజీనామా చేసేందుకు సిద్ద‌మ‌ని అన్నారు. అయితే టీడీపీ ఎంపీ సీఎం ర‌మేష్ తో పాటు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంద‌రూ రాజీనామా చేస్తార‌ని ఆయ‌న స‌వాల్ విసిరిన సంగ‌తి తెలిసిందే.
 
ఇక తాజాగా క‌డ‌ప ఉక్కును డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు కీల‌క నిర్ణం తీసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు వ్య‌తిరేకంగా వైసీపీ నాయ‌కులు ఈ నెల 29న రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చిన‌ట్లు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. కాగా బంద్ జ‌రిగిన మ‌రుస‌టి రోజునాడే వైసీపీ ఎమ్మెల్యేలు ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు అనంత‌పురం జిల్లాలో న‌య‌వంచ‌న దీక్ష చేయ‌నున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.