ఈ ఫోటోకు అవార్డ్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-10-11 11:25:48

ఈ ఫోటోకు అవార్డ్

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర కొద్దిరోజుల క్రితం 3000 వేల కిలో మీట‌ర్ల‌ను పూర్తి చేసుకుని గిన్నీస్ రికార్ట్ సృష్టించిన సంగ‌తి మ‌నంద‌రికీ తెలిసిందే. ఈ పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ ఎంతో ఓపిక‌గా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ వారికి కొండంత భ‌రోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. 
 
సుమారు ప‌ది నెల‌ల‌పాటు ఏక‌దాటిగా పాద‌యాత్ర‌చేస్తున్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని రాష్ట్ర‌ ప్ర‌జ‌లు త‌మ సొంత కొడుకులు, నేటి యువ‌త‌రం త‌న సొంత అన్నలా ఆధ‌రించి ఆల‌సిపొయిన జ‌న‌నేత‌ ముఖాన్ని త‌మ కొంగుతో చ‌మ‌ట‌ల‌ను తుడుస్తున్నారు. అలా ఓ యువ‌తి జ‌గ‌న్ ముఖాన్ని కొంగుతో తుడుస్తున్న స‌మ‌యంలో మీడియా ప్ర‌తినిధి ఫోటో తీశారు. అయితే తాజాగా స్టేట్ ఫోటో జర్న‌లిస్ట్ అసోసియేష‌న్ ఆఫ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ నిర్వ‌హించిన జాతీయ స్థాయి ఫోటో గ్ర‌ఫీ పోటీల్లో ఈ ఫోటోకు అవార్డు  ద‌క్కింది.
 
 స్పాట్ న్యూస్ జ‌న‌ర‌ల్ న్యూస్ విభాగాల్లో ఫోటోల‌ను ఆహ్వానించిన ఫోటో జ‌ర్న‌లిస్ట్ అసోసియేష‌న్ వాటిలో కొన్ని ఉత్త‌మ‌మైన ఫోటోల‌ను ఎంపిక చేసింది. ఈ అవార్డులో భాగంగా తోలి, ద్వితియ‌, తృతియ ఉత్త‌మ చిత్రాల‌ను గుర్తించి అవార్డును ప్ర‌క‌టిస్తారు. అందులో పాద‌యాత్రలో తీసిన ఫోటో సెల‌క్ట్ కావ‌డంతో వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కు సంతోషిస్తున్నారు. గెలుపొందిన వారికి  అమ‌రావ‌తిలో న‌వంబ‌ర్ 1న బ‌హుమ‌తిని అంద‌జేస్తామ‌ని కాంటెస్ట్ చైర్మ‌న్ టీ శ్రీనివాస‌రెడ్డి స్ప‌ష్టం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.