ఈ అస్త్రాన్ని వదిలితే టీడీపీ గల్లంతే.

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-06 05:01:41

ఈ అస్త్రాన్ని వదిలితే టీడీపీ గల్లంతే.

2004  ఎన్నికలల్లో మిత్రపక్షాలుగా ఉన్న టీడీపీ, బీజేపీలు, కేంద్రలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీలు ఘోర పరాజయాన్ని చవిచూశాయి...ఆ ఓటమి తర్వాత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బీజేపీపైన ఘాటు వ్యాఖ్యలు చేసారు...ఆ వ్యాఖ్యలు ఏంటంటే "ఇక ఈ జన్మలో బీజేపీతో పొత్తుపెట్టుకోము, వాళ్ళతో పొత్తుపెట్టుకొని మా కాళ్ళను మేమె నరుకున్నాము, వాళ్ళతో పొత్తుపెట్టుకున్నందుకు మమల్ని క్షమించండి అన్నారు".
 
టీడీపీ ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు చేసిన, 10 ఏళ్లపాటు ప్రతిపక్షపాత్ర పోషించి విసిగిపోయిన బీజేపీ ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని, అన్ని మర్చిపోయి 2014 ఎన్నికలలో టీడీపీతో దోస్తీ కట్టింది.. ఇక టీడీపీ కూడా ఏమి తక్కువ తినలేదు, ఆ సమయంలో మోడీకి ఉన్న క్రేజ్ ని ఉపయోగించుకొని అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీకి మిత్రపక్షమైంది...ఇలా ఎవరి స్వార్ధ రాజకీయాలకోసం వాళ్ళు, రాజకీయంగా లబ్ది పొందడానికి భాగస్వాములుగా మారారని అనుకుంటున్నారు.
 
ఇక ఈ ఎన్నికల్లో ఇరు పార్టీలు జయభేరి మోగించాయి.. అయితే బీజేపీ మాత్రం ఎవరు ఊహించని విధంగా, ఏ మిత్రపక్షాల మద్దతు అవసరం లేకుండా, బారి మెజార్టీతో విజయడంకా మోగించింది. అప్పటి నుండే టీడీపీపై బీజేపీ దండయాత్ర మొదలుపెట్టింది... ఆ దండయాత్రలో భాగంగానే చంద్రబాబు తెలివితేటలను గమనించిన బీజేపీ, మొదటి నుండే టీడీపీని దూరం పెడుతూ...వచ్చింది..ఈ దూరం మూడేళ్లు గడవక ముందే ఇరు పార్టీల మధ్య వైరంగా మారింది.
 
మోడీని, జగన్ కలిసినప్పటి నుండి, ఆ దండయాత్రకు కొనసాగింపుగా బీజేపీ నాయకులు మిత్రపక్షమైన టీడీపీ, ఆ పార్టీ అధినాయకుడిపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు...దింతో 2019 ఎన్నికలలో టీడీపీకి, బీజేపీ దొరమవుతుందనే ఊహాగానాలు ఎక్కువయ్యాయి. దీనికి మరింత బలం చేకూరేలా ఒక వ్యక్తిని నమ్మి 30 సంవత్సరాల పాటు మోసపోయాం, ఇక మోసపోయే ప్రసక్తే లేదు అని అమిత్ షా చేసిన వ్యాఖ్యలు, విజయవాడలో  బీజేపీ నిర్వహించిన బారి బహిరంగ సభలో, బీజేపీ అభిమానులు "LEAVE టీడీపీ SAVE బీజేపీ" అనే నినాదంతో బారి ఎత్తున ప్లకార్డులను ప్రదర్శించడంతో, టీడీపీకి బీజేపీ దూరం అవ్వడం ఖాయం అని రాజకీయ మేధావులు అంటున్నారు...
 
బాబు చేసిన అవినీతిని గమనించిన బీజేపీ క్రమక్రంగా టీడీపీని దూరం పెడుతూ వచ్చింది, ఆ తర్వాత జరిగిన ప్రత్యేక హోదా పరిణామాల నేపథ్యంలో మరో సారి వెన్నుపోటు రాజకీయానికి తెరలేపింది టీడీపీ...అందులో భాగంగానే ఓటుకు నోటు కోసం నాలుగేళ్లు సంసారం చేసిన టీడీపీ, ఎన్నికలు దగ్గరకు రావడంతో తన అసలు బుద్దిని బయటపెట్టింది...బీజేపీ నుండి విడాకులు తీసుకుంది...
 
టీడీపీ - బీజేపీ నుండి బయటకు వచ్చినప్పటి నుండి బీజేపీ నేతలు విష్ణు కుమార్ రాజు, సోము వీర్రాజు, పురందేశ్వరి ప్రభుత్వ అవినీతిపైనా ఘాటు పెంచారు...లోకేష్ చేసిన అవినీతి చిట్టా బయటపెడతామని చెప్పారు..రాజధాని కోసం 1500 కోట్ల రూపాయలు ఇస్తే దానిని మింగేస్తారా అని టీడీపీపైన మండిపడుతున్నారు బీజేపీ నేతలు...పట్టి సీమ నుండి మొదలు మట్టి వరకు మీరు చేసిన అవినీతిని ఆధారాలతో సాహ బయటపెడతాము...అవినీతి అనే అస్త్రాన్ని మేము బయటకు వదిలితే, ఏపీలో టీడీపీ గల్లంతేనని అంటున్నారు బీజేపీ నాయకులు... ఆ అస్త్రాన్ని బయటకు వదిలి టీడీపీని బండారాన్ని బయటపెట్టడానికి బీజేపీ పావులు కదుపుతోందని సమాచారం....అందుకే ఈ అవినీతి అస్త్రానికి బయపడి మళ్ళి బీజేపీని కాకాపట్టడానికి బీజేపీ మంత్రి భార్యకు టీటీడీ బోర్డు మెంబెర్ పదవిని కట్టబెట్టారు చంద్రబాబు..

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.