బాబు అందుకే పరిమితం...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-02 01:20:29

బాబు అందుకే పరిమితం...

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు నిన్న అనంత‌పురుం జిల్లా పేరూరులో పర్య‌టించిన నేప‌థ్యంలో, ఆయ‌న స‌భకు డ్వాక్రా మ‌హిళ‌ల‌ను ఖ‌చ్చితంగా రావాలంటూ బెందింపుల‌కు దిగుతున్నార‌ని ప్ర‌తిపక్ష‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు స‌మ‌న్వ‌యక‌ర్త తోపుదుర్తి  ప్ర‌కాశ్ రెడ్డి మండిప‌డ్డారు. ఈ రోజు పార్టీ కార్యాలాయంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, పేరూరులో ఒక ప‌థ‌కానికి శిలాఫలకం వేసేందుకు వెళ్లిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌భ‌కు దేశానికి అన్నం పెట్టే రైతులు కూడా రాలేదని  తోపుదుర్తి ఆరోపించారు. 
 
టీడీపీ హాయాంలో ఎటు చూసినా తెలుగు త‌మ్ముళ్లు బెదింపులుకు దిగుతున్నార‌ని ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు. అధికార బలంతో టీడీపీ నాయకులు ప్ర‌జ‌ల‌ను బెదిరించి, వారిని బ‌య‌బ్రాంతుల‌కు గురిచేసి జేజేలు ప‌లికించుకుంటున్న ప‌రిస్థితి వ‌చ్చింద‌ని ఆయ‌న గుర్తు చేశారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పేరుకు మాత్ర‌మే త‌న‌కు ఇష్ట‌మైన జిల్లాగా చెబుతారు కాని అభివృద్ది విష‌యంలోకి వ‌స్తే ఆమ‌డంత దూరంలో ఉంద‌ని తోపుదుర్తి విమ‌ర్శ‌లు చేశారు. 
 
చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చి నాలుగు సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్నా కూడా అనంత‌పురం జిల్లాలో ఒక్క‌రికి కూడా జాబులు ఇవ్వ‌లేద‌ని ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు హాయంలో కేవ‌లం శిలాఫలకాలను ఆవిష్కరిస్తూ వెళ్లున్నారు త‌ప్ప అభివృద్ది చేయ‌డం లేద‌ని ప్ర‌కాశ్ రెడ్డి మండిప‌డ్డారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.