వారికోసం చ‌స్తా వైసీపీ ఎమ్మెల్యే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-22 17:20:07

వారికోసం చ‌స్తా వైసీపీ ఎమ్మెల్యే

2014 లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో ఎక్క‌డ చూసినా అవినీతి అక్ర‌మాలకు అడ్డు అదుపూ లేకుండా పోతుంద‌ని అనంత‌పురం జిల్లా రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స‌మ‌న్వ‌యక‌ర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు.
 
ఆత్మకూరు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట చేపట్టిన రైతు ధర్నాలో ఆయ‌న పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్ర‌భుత్వం వెంట‌నే స్పందించి వేరు సెనగ రైతుల‌కు భ‌రోసా అందించేందుకు కిలో 61 రూపాయాల‌ను మ‌ద్ద‌తు ధ‌ర ప్ర‌క‌టించాల‌ని ప్ర‌కాశ్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే ఉపాధి ప‌నుల‌ను వ్య‌వ‌సాయానికి అనుబంధంగా చేయాల‌ని ఆయ‌న కోరారు.
 
రాష్ట్ర ప్ర‌భుత్వం రైతుల‌కు అన్యాయం చేస్తే స‌హించేది లేద‌ని అన్నారు. తాను రైతు బిడ్డ‌న‌ని రాజ‌కీయ అరంగేట్రం చేయ‌కముందు రైతు బిడ్డ‌న‌ని స్ప‌ష్టం చేశారు. అలాగే తాను రాజ‌కీయంలో ఉన్నా కూడా రైతుల కోసం జీవిస్తాన‌ని, రైతు బాగు కోసం త‌న ప్రాణాలను అయినా అర్పిస్తాన‌ని అన్నారు. టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన తర్వాత రాప్తాడు నియోజ‌కవ‌ర్గంలో బ్రోక‌ర్ల రాజ్యం ఎక్కువ‌గా సాగుతోంద‌ని తోపుదుర్తి మండిప‌డ్డారు.
 
అధికార బలంతో మంత్రి సునిత అక్ర‌మంగా ప్ర‌జా ధ‌నాన్ని కొల్ల‌గొట్టేస్తున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. మంత్రి సునిత త‌న బందువుల‌ను నియోజ‌కవ‌ర్గ ప‌రిధిలోని ప్ర‌తీ మండ‌లానికి ఇంచార్జ్ లుగా నియ‌మించి ప్ర‌జా ధ‌నాన్ని దోపిడి చేస్తున్నార‌ని తోపుదుర్తి ప్ర‌కాష్ రెడ్డి మండిప‌డ్డారు. అంతేకాదు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో మంత్రి త‌న‌కు అనుకూలంగా సుమారు 25 వేల దొంగ ఓట్ల‌ను జాబితాలో చేర్చార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి అయితే ఖచ్చితంగా రైతుల‌కు కిలో వేరు శ‌న‌గ‌ల‌ను 61 గిట్టుబాటు ధ‌ర వ‌చ్చేలా చేస్తాన‌ని తోపుదుర్తి ప్ర‌కాశ్ రెడ్డి రైతుల‌కు హామీ ఇచ్చారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.