టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ టెన్ష‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp flag
Updated:  2018-10-06 05:54:58

టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ టెన్ష‌న్

2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌రకు వ‌స్తున్న తరుణంలో  నెల్లూరు జిల్లాలో టీడీపీ రాజ‌కీయాలు హాట్ హాట్ సాగుతున్నాయి. ఈ జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉంటే విభ‌జ‌న త‌ర్వాత 2014లో మొద‌టిసారిగా ఎన్నిక‌లు జ‌రిగితే ఆ ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏడుస్థానాల‌ను గెలుచుకోగా తెలుగుదేశం పార్టీ కేవ‌లం మూడు స్థానాలను మాత్ర‌మే ప‌రిమితం అయింది. టీడీపీ అధికారంలో వ‌చ్చినా నెల్లూరులో పార్టీ పర్ఫామెన్స్ స‌రిగ్గా లేక‌పోవ‌డంతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అస‌హ‌ణంతో ఉన్నారట‌. 
 
ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ మెజార్టీ సీట్ల‌ను సాధించాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్నార‌ట చంద్ర‌బాబు నాయ‌డు. ఇదే క్ర‌మంలో పార్టీలో టికెట్ల వార్ ఎప్ప‌టినుంచో కొన‌సాగుతుంది. అందులో ముఖ్యంగా ఉద‌య‌గిరి టీడీపీలో మ‌రింత సెగ‌లు పొగ‌లు భ‌గ్గుమంటున్నాయ‌ట‌. 2014లో ఉద‌యగిరి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీనే విజ‌యం సాధించింది. అయితే ప్ర‌స్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకు అదేపార్టీలోకి చెందిన నాయ‌కుల‌మ‌ధ్య‌ అసంతృప్తి సెగ‌లు భ‌గ్గుమంటున్నాయ‌ట‌. 
 
ఈ క్ర‌మంలో వ‌చ్చేఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున ఆయ‌న   పోటీ చెయ్య‌డం ఖాయం అయిందనే ప్ర‌చారం కూడా విస్రృతంగా సాగుతుంద‌ట‌. గ‌త ఎన్నికల్లో చంద్ర‌శేర్ పై బొల్లినేని విజ‌యంసాధించారు. ఇసారికూడా త‌న‌దే విజ‌యం అని చెబుతున్న బొల్లినేని వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు టికెట్ ఇస్తే పార్టీ ఓడిపోవ‌డం ఖాయం అని అధిష్టానానికి హెచ్చ‌రిక‌లును జారిచేస్తున్నార‌ట కొంత‌మంది టీడీపీ నాయ‌కులు. 
 
బొల్లినేని మ‌హారాష్ట్ర‌లో కాంట్రాక్టులు చేసుకుంటూ నియోజ‌క‌ర్గాన్ని ప‌ట్టించుకోవ‌డంలేదంటూ అసంతృప్తులు ఇప్ప‌టికే ఫిర్యాదులు మీద ఫిర్యాదులు చేస్తున్నార‌ట‌. ఇక అదే స‌మ‌యంలో మేక‌పాటిని డీ కోట్టె స‌త్తా త‌మ‌కే ఉందంటూ సొంత స‌ర్వేల‌తో హైక‌మాండ్ ను మెప్పించే ప‌నిలో బిజీగా ఉన్నార‌ట మ‌రికొంద‌రు టీడీపీ నేత‌లు. దీంతో బొల్లినేనికి టికెట్ కేంద్రంగా టెన్ష‌న్ పుడుతోంద‌ట‌.ఇక ఇదే క్ర‌మంలో మాజీ ఎమ్మెల్యేలు టికెట్ రేసులో ఉన్నార‌ట‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.