బాబు ప‌రిపాల‌న‌పై ప్ర‌జాభిప్రాయం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-09 15:31:11

బాబు ప‌రిపాల‌న‌పై ప్ర‌జాభిప్రాయం

2019 సార్వత్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో ఇటు ఎపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుతో పాటు, అటు ప్ర‌ముఖ మీడియా సంస్థ‌ల‌కు చెందిన వారు కూడా స‌ర్వేల‌ను నిర్వ‌హిస్తున్నారు.ఈ స‌ర్వేలో ముఖ్యంగా చంద్ర‌బాబు నాయుడు ప‌రిపాల‌న, ఆయ‌న అభివృద్దిని దృష్టిలో ఉంచుకుని స‌ర్వే చేప‌డుతున్నారు. అయితే ఈ స‌ర్వే ప్ర‌కారం వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ ఓట‌మి పాలు కావ‌డం ఖాయం అని తెలుపుతున్నారు.
 
ఇక ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు నాయుడు ప‌రిపాల‌న రాష్ట్రంలో నాలుగు సంవ‌త్స‌రాలు పూర్తి అయిన నేప‌థ్యంలో ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ గ్రూపుకు చెందిన తెలుగు వెబ్‌సైట్ వారు ప్రజాభిప్రాయ సేకరణ (ఒపీనియన్‌ పోల్‌) నిర్వ‌హించారు. ఈ స‌ర్వేలో నూటికి అర‌వై శాతం చంద్ర‌బాబు ప‌రిపాల‌న‌పై వ్య‌తిరేక‌త చూపుతున్నార‌ని తెలిపారు.
 
2014 లో చంద్ర‌బాబు నాయుడు అధికారంలోకి వ‌చ్చాక ప్రత్యేక హోదా సాధన, ప్రభుత్వ ఉద్యోగాల కల్పన, రాజధాని నిర్మాణం ఇలా ప్ర‌తీ విష‌యంలో ప్ర‌జ‌లు విసుగు చెందార‌ని ఈ స‌ర్వే  తెలిపింది. తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న త‌ర్వాత చంద్ర‌బాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవం అమరావతికి ఉపయోగపడలేదని తేల్చారు. అలాగే అధికార బ‌లంతో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల‌ను రాజ్యాంగానికి విరుద్దంగా వారిని పార్టీలో చేర్చుకోవ‌డ‌మే కాకుండా మంత్రి పదవులు కూడా కట్టబెట్టడం సరికాదని 80 శాతం మంది సూచించారు.  
 
దీంతో పాటు ఆయ‌న కూమారుడిపై కూడా ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెరిగింద‌ని తెలిపారు. ఇక ఫైన‌ల్ గా ఇప్ప‌టికిప్పుడు రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌రిగితే మీరు టీడీపీ కి ఓటు వేస్తారా! లేక వైసీపీకి ఓటు వేస్తారా! అని అడిగితే వైఎస్ జ‌గ‌న్ కే త‌మ ఓటు వేస్తామ‌ని నూటికి 80 శాతం మంది చెబుతున్నార‌ని తెలిపారు. అంతే కాదు జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయితే తాము మ‌ళ్లీ రాజ‌న్న ప‌రిపాల‌న చూస్తామ‌ని అంటున్నార‌ని ఈ స‌ర్వే తెలిపింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.