ఆ ఎంపీకి తిరుగేలేదు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-09 17:12:32

ఆ ఎంపీకి తిరుగేలేదు

ఆయ‌నో ఐఎఎస్ అధికారి రాజ‌కీయ నాయ‌కుల‌ను అనేక మందిని చూసిన ఉద్యోగి.. ఆయ‌న ఉద్యోగానికి రాజీనామా చేసి రాజ‌కీయాల్లోకి వ‌చ్చి 2009 ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు... అయినా 2014 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. ఆయ‌నే తిరుప‌తి ఎంపీ వరప్రసాద్.
 
రాజ‌కీయాల్లోకి అనుకోకుండా వ‌చ్చారు వరప్రసాద్.... తమిళనాడు రాష్ట్రంలో ప‌లు జిల్లాలకు  కలెక్టర్ గా పనిచేసి రిటైర్ మెంట్ సమయానికి ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఉన్నారు ఆయ‌న . 2009 ఎన్నికలకు ముందు చిరంజీవిని కలిసి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ పార్టీ తరపున నాటి ఎన్నికల్లో తిరుపతి ఎంపిగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత మళ్లీ చెన్నై వెళ్లిపోయారు. చాలా కాలం ఎవ్వరికీ కనిపించలేదు ఆయ‌న . 
 
చివరకు 2014 ఎన్నికలకు ముందు వైసిపిలో చేరి తిరుపతి ఎంపీగా విజయం సాధించారు. ఇంతటి విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు ఆయ‌న ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ఏపీలో త‌న‌కంటూ ఎంపీల‌లో ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు... అంద‌రితో క‌లిసిపోయే మ‌న‌స్త‌త్వం, అలాగే స‌బ్జెక్ట్ లో కూడా దేనిపైన అయినా ఆయ‌న మాట్లాడే విధానం అంద‌రికి న‌చ్చుతుంది... స్పీచ్ స్ప‌ష్టత ఉంటుంది. బ్యూరో క్రాట్ గా కూడా ఆయ‌న అనుభ‌వం పార్టీకి ఎంతో ఉప‌యోగ‌ప‌డుతోంది.
 
తిరుప‌తి ఎంపీ స్ధానం అంటే ఇటు చిత్తూరు జిల్లా అలాగే నెల్లూరు జిల్లాలో విశాలంగా విస్త‌రించి ఉన్న ప్రాంతం... ఇటు ఇరు జిల్లాల సెగ్మెంట్లలో ప‌ట్టు సాధించుకోవాలి అంద‌రి ఇంచార్జ్ ల‌తో స‌యోధ్య‌గా మెలిగి విజ‌యం సాధించాలి... గ‌త ఎన్నిక‌ల్లో ఈ విష‌యంలో వ‌ర‌ప్ర‌సాద్ విజ‌యం సాధించారు అని చెప్పాలి... ఆ త‌ర్వాత ఆయ‌న‌కు మ‌రింత ప్ర‌జ‌ల నుంచి మ‌ద్ద‌తు వ‌చ్చింది...
 
జ‌గ‌న్ కు వెన్నంటి ఉండ‌టం అలాగే వైసీపీ త‌ర‌పున అన్నీ కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రుకావ‌డం.. ఇక ఏపీకి ప్ర‌త్యేక హూదా విష‌యంలో కూడా ఆయ‌న తిరుగులేని నాయ‌కుడిగా నిల‌బ‌డ్డారు.. ఆమర‌ణ నిరాహార‌దీక్ష చేసి ప్ర‌త్యక హూదా పోరాటం చేశారు...ఇక ఈ ఎంపీకి వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా విజ‌యం ఖాయం అంటున్నారు అక్క‌డ ప్ర‌జ‌లు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.