ఈ రోజు ఏపీలో సంచ‌లన వార్త రావ‌డం ఖాయం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-06 14:57:39

ఈ రోజు ఏపీలో సంచ‌లన వార్త రావ‌డం ఖాయం

తెలుగు రాష్ట్రాలు విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన ప్ర‌త్యేక హోదా, రైల్వే జోన్, క‌డ‌ప ఉక్కు ప‌రిశ్ర‌మ‌ల‌ను కేంద్రం ప్ర‌క‌టించకుండా విభ‌జ‌న హామీల‌న్ని ప్ర‌క‌టించామ‌ని బీజేపీ నాయ‌కులు సుప్రీం కోర్టుకు అఫిడ‌విట్ స‌మ‌ర్పించ‌డం దారుణమ‌ని అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు మండిప‌డుతున్నారు. రాష్ట్రంలో రెవిన్యూలోటు కేవ‌లం నాలుగు వేల కోట్ల‌ని అందులో 3900 కోట్ల‌ను ఏపీకి ఇచ్చామ‌ని కేంద్రం చెప్ప‌డం దారుణం అని విమ‌ర్శిస్తున్నారు.
 
అలాగే వెనుక‌బ‌డిన ప్రాంతాల‌యిన‌టువంటి రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాధ్ర ప్రాంతాల‌కు కేవ‌లం 15 వంద‌ల‌కోట్లను కేటాయిస్తే స‌రిపోతుంద‌ని పిటిష‌న్ లో పేర్కొన్నార‌ని టీడీపీ నాయ‌కులు వాపోతున్నారు. ఇక ఇదే విష‌యంపై ప్ర‌తిప‌క్ష నాయ‌కులు కూడా మండిప‌డుతున్నారు. విభ‌జ‌న హామీల‌ను ప్ర‌క‌టించ‌కుండా కేంద్రం వెన్నుపోటు పొడిస్తే, చంద్ర‌బాబు నాయుడు నాలుగు సంవ‌త్స‌రాలు బీజేపీతో మిత్రప‌క్షంగా వ్యవ‌హ‌రించి ద‌గ్గ‌రుండి వెన్నుపోటు పొడిపించార‌ని విమ‌ర్శలు చేస్తున్నారు.
 
అయితే తాజాగా ఈ అఫిడ‌విట్ పై నేడు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తిలో టీడీపీ నాయ‌కుల‌తో క్యాబినెట్ స‌మావేశం ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ స‌మావేశంలో కేంద్రం విభ‌జ‌న హామీల విష‌యంలో ప్ర‌వ‌ర్తించిన తీరు, అలాగే రాష్ట్ర భ‌విష్య‌త్ కార్య‌చ‌ర‌ణ‌పై నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. సమావేశం తర్వాత కేంద్రంపై పోరు కొత్త రూపు దాల్చే అవకాశం కనిపిస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.