జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు నేడు బ్రేక్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jagan padayatra
Updated:  2018-09-21 11:51:46

జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు నేడు బ్రేక్

ప్ర‌తిపక్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 2019లో అధికార‌మే ల‌క్ష్యంగా చేసుకుని ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంక‌ల్ప‌యాత్రలో జ‌గ‌న్ ప్ర‌జా స‌మస్య‌ల‌ను తెలుసుకుంటూ అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న అవినీతి అరాచ‌కాల‌ను వివ‌రిస్తున్నారు. అంతేకాదు 2019లో వైసీపీ అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌మ‌వ‌రత్నాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు. 
 
ఇప్ప‌టికే ఈ పాద‌యాత్ర రాయ‌ల‌సీమ‌లోని నాలుగు జిల్లాల‌ను, అలాగే కోస్తాలోని ఆరు జిల్లాల‌ను పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీ నాయ‌కులు కంచుకోట విశాఖ‌ప‌ట్నం జిల్లాలో దిగ్విజ‌యంగా కొన‌సాగుతుంది. పేరుకు మాత్ర‌మే టీడీపీ కంచుకోట అయినా జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో ఎప్పుడు అయితే ఈ జిల్లాలో అడుగుపెట్టారో అప్ప‌టినుంచి పాద‌యాత్ర‌లో ఇసుక వేస్తే రాల‌నంత జ‌నం హాజ‌రై జ‌న‌నేత‌కు జేజేలు ప‌లుకుతున్నారు. 
 
అయితే తాజాగా శుక్ర‌వారం జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు బ్రేక్ ప‌డింది. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో మొహ‌రం పండుగ జ‌రుపుకుంటున్న సంద‌ర్భంగా పాద‌యాత్ర‌కు విరామం ప్ర‌క‌టించామ‌ని వైసీపీనేత త‌ల‌శిల ర‌ఘురావ తెలిపారు. ఈ నెల 22 శ‌నివారం నుంచి య‌థావిధిగా పప్ప‌ల‌వానిపాలెం శివారునుంచి పాద‌యాత్ర కొన‌సాగుతుంద‌ని ఆయ‌న తెలిపారు

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.