నేడు విద్యాసంస్థ‌లు బంద్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp
Updated:  2018-08-04 11:25:13

నేడు విద్యాసంస్థ‌లు బంద్

విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన క‌డ‌ప ఉక్కు పరిశ్ర‌మ‌ను డిమాండ్ చేస్తూ కొద్ది కాలంగా ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల‌తో పాటు విద్యార్థి సంఘాల నాయ‌కులు, వామ‌ప‌క్ష నేత‌లు అలుపెరుగ‌ని పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పోరాటంపై స‌ర్కార్ క‌న్నెర్ర చేస్తోంది. జిల్లా స్థాయిలో శాంతియుతంగా చేస్తున్న ఆందోళ‌న‌ల‌ను పోలీస్ అధికారులు అడ్డుకుని వారిపై దాడికి దిగుతున్నారు.
 
ఇక వారు చేస్తున్న దాడికి వ్య‌తిరేకంగా విద్యార్థి సంఘాల‌ నాయ‌కులు ఈ రోజు అన‌గా ఆగ‌స్టు 4వ‌తేదిన‌ విద్యా సంస్థ‌ల బంద్ కు పిలుపునిచ్చారు. క‌డ‌ప ఉక్కు రాయ‌ల‌సీమ హక్కు అంటూ ఉక్కు ప‌రిశ్ర‌మ‌కోసం నిన్న జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాలయం ముట్ట‌డికి పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాల నాయ‌కుల‌పై పోలీస్ అధికారులు లాఠీ చార్జ్ చేశారు. 
 
అయితే ఈ ఘ‌ట‌న‌లో కొంత‌మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘ‌ట‌న‌కు వ్య‌తిరేకంగా నేడు విద్యాసంస్థ‌ల‌ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ బంద్ కు ప‌లు విద్యార్థి సంఘాల నాయ‌కుల‌తో పాటు, వామ‌ప‌క్షాలు, జ‌న‌సేన‌, ప్ర‌తిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు కూడా మ‌ద్ద‌తు తెలిపారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.