ఆగ‌ని స‌మ‌రం వైసీపీ నేడు బంద్ కు పిలుపు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-29 15:08:08

ఆగ‌ని స‌మ‌రం వైసీపీ నేడు బంద్ కు పిలుపు

విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన క‌డ‌ప ఉక్కు ప‌రిశ్ర‌మను డిమాండ్ చేస్తూ ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేడు బంద్ కు పిలునిచ్చారు. అయితే పార్టీ నిర్ణ‌యం మేర‌కు పార్లమెంట‌రీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి రాజంపేట ప‌ట్టణంలో బంద్ ను నిర్వ‌హించారు.
 
మొద‌టిగా ఈ బంద్ ను ఆర్టీసీ బస్టాండు రోడ్డు ఎదురుగా  వైసీపీ నాయ‌కులు చేప‌ట్టారు. ఈ బంద్ కు సిపిఐ, సిపిఎంలతో పాటు విద్యార్థి సంఘ నాయ‌కులు కూడా స్వ‌చ్చందంగా పాల్గొని బంద్ కు పిల‌పునిచ్చారు. వైసీపీ బంద్ కు పిలుపునివ్వ‌డంతో ఆర్టీసీ బ‌స్సుల‌న్నిడిపోల‌కే ప‌రిమితం అయ్యాయి. 
 
ఈ సందర్భంగా అమర్ నాథ్ రెడ్డి మాట్లాడుతూ, సీఎం రమేష్ దీక్షలు నిజమైతే టీడీపీ నాయ‌కులు ఎందుకు బందులో పాల్గొనలేదని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇకనైనా దొంగ దీక్షలు మాని ఉక్కు సాధ‌న‌కై అసలైన పోరాటం చేయాలని అమర్నాథ్ రెడ్డి సూచించారు.
 
వైసీసీ నాయ‌కులు విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన అంశాల‌పై నాలుగు సంవ‌త్స‌రాల నుంచి కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలకు వ్య‌తిరేకంగా పోరాడుతున్నామ‌ని అమ‌ర్ నాథ్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. ప్రత్యేక హోదా, కడప ఉక్కు పరిశ్రమ రైల్వేజోన్ వంటివి ఇంకా స‌జీవంగా ఉన్నాయంటే అది ఒక్క వైఎస్‌ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌ల్లే అని ఆయ‌న అన్నారు.

షేర్ :

Comments

1 Comment

  1. Yes Correct

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.